జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. ఎన్టీఆర్ స్ఫూర్తి.. చంద్రబాబు భరోసా పేరుతో ప్రజల్లోకి వెళ్తున్నారు.. అయితే, చంద్రబాబు టూర్‌పై సెటైర్లు వేశారు మంత్రి జోగి రమేష్.. చంద్రబాబు జిల్లాల పర్యటనకు ‘ఎన్టీఆర్ స్ఫూర్తి… చంద్రబాబు భరోసా’ అని పేరు పెట్టారు.. ఇది బాగలేదు.. దానిని ‘ఎన్టీఆర్‌కు వెన్నుపోటు.. ప్రజలకు కుచ్చుటోపీ’ అని పెట్టుకోవాలని ఎద్దేవా చేశారు.. నెల్లూరు జిల్లా పర్యటనలో మీడియాతో మాట్లాడిన ఆయన.. సమావేశంలో జోకర్ లాగా కనిపించారు.. చంద్రబాబు ఒక జోకర్ లాగా..బ్రోకర్ లాగా అయ్యన్న పాత్రుడు మాట్లాడారు అంటూ మండిపడ్డారు.
Read Also: Andhra Pradesh: నాణ్యమైన విద్య వైపు మరో అడుగు..! ‘బైజూస్’తో ఒప్పందం
వైఎస్ జగన్ ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని తెలిపారు మంత్రి జోగి రమేష్.. సామాజిక న్యాయానికి స్ఫూర్తిగా సీఎం జగన్ నిలబడ్డారన్న ఆయన.. అన్ని వర్గాలకు పదవులు ఇచ్చి న్యాయం చేవారని ప్రశంసలు కురిపించారు.. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్నా ఒక పథకం కూడా ప్రజలకు గుర్తు ఉండదని ఎద్దేవా చేసిన ఆయన.. అయ్యన్న పాత్రుడు మాట్లాడిన బాష బాగలేదు.. నేతల తీరును చంద్రబాబు మార్చాలని సూచించారు. ముఖ్యమంత్రిని.. పోలీస్ వ్యవస్థను కించపరిచేలా మాట్లాడితే ప్రజలే తిరగబడతారు.. పద్దతి మారకపోతే తగిన శాస్తి చేస్తామని హెచ్చరించారు మంత్రి జోగి రమేష్.