కొత్తపల్లి సుబ్బారాయుడు. రాజకీయంగా దిట్ట అనేది ఒకప్పటి మాట. కొత్త పార్టీల ఎంట్రీతో మారిన రాజకీయాలను అంచనా వేయలేక ఇప్పుడు సాధారణ నాయకుడిగా మిగిలిపోయారు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం నుంచి వరసగా గెలుస్తూ అదే స్పీడ్లో ఉన్నత పదవులు అందుకున్నారు. అప్పటి వరకు జిల్లా రాజకీయాలను కనుసైగతో శాసించేవారు. అలాంటిది 2009 నుంచి ఆయన అంచనాలు సరిగ్గా వర్కవుట్ కాలేదనే చెప్పాలి. అప్పుడు మొదలైన రాజకీయ పతనం.. కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు రాజకీయంగా నిలదొక్కుకోవడానికి.. ఉనికి కాపాడుకోవడానికి…
టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్రను పోలీసులు అరెస్ట్ చేశారు. గుంటూరు జిల్లా అనుమర్లపూడి చెరువు వద్ద పోలీసులు ధూళిపాళ్ల నరేంద్రను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయనతో పాటు మరికొందరు టీడీపీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేసి.. అక్కడి నుంచి తరలించారు. అయితే.. గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గంలో మట్టి దోపిడి జరుగుతుందని ఆరోపిస్తూ నేడు చలో అనుమర్లపూడికి ధూళిపాళ్ల నరేంద్ర పిలపునిచ్చారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు.. గ్రామంలో 144 సెక్షన్ విధించినట్టుగా చెప్పారు. అనుమర్లపూడిలో నిరసనలకు అనుమతి…
స్వేచ్చగా ఉన్నప్పుడు భూతుపురాణం. పోలీసులు గాలిస్తుంటే అజ్ఞాతవాసం. ఇదీ మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు స్టైల్. పర్యాటకశాఖ మంత్రి ఆర్కేరోజాను కించపరిచేలా అయ్యన్న కామెంట్స్ చేయడం రాజకీయంగా దుమారం రేగుతోంది. చోడవరం మినీ మహానాడు వేదిక నుంచి ఆయన చేసిన వ్యాఖ్యాలపై అధికారపార్టీ భగ్గుమంది. వ్యక్తిగతంగా అయ్యన్నను టార్గెట్ చేసిన అధికారపార్టీ నేతలు తీవ్రమైన పదజాలంతో విరుచుకుపడ్డం వాతావరణాన్ని వేడెక్కిస్తోంది. మహిళా మంత్రినే కాదు పోలీసు అధికారులను అయ్యన్నపాత్రుడు తరచూ ఆక్షేపించడం వివాదాస్పదంగా మారుతోంది. ఉమ్మడి విశాఖజిల్లా…
ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నా.. పొత్తులు ఎత్తులు.. జిత్తులపై రకరకాలుగా చర్చలు జరుగుతున్నాయి. ముఖ్యంగా టీడీపీ, జనసేన రెండు కలిసి పోటీ చేస్తాయని అనుకుంటున్నారు. ఆ మధ్య కుప్పం పర్యటనలో చంద్రబాబు… జనసేనకు వన్సైడ్ లవ్ అని కన్నుగీటారు. ఆ తర్వాత జనసేన ఆవిర్భావ సభలో వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వబోనని పవన్ కల్యాణ్ ప్రకటించారు. ఈ మాటలు.. ప్రకటనలతో రెండు పార్టీలు దగ్గరవుతున్నట్టు భావించారు. కానీ.. ఇటీవల నిర్వహించిన మహానాడు తర్వాత టీడీపీ…
పర్చూరులో కౌలు రైతుల భరోసా యాత్ర సందర్భంగా జనసేనాని పవన్ కళ్యాణ్ చేసిన విమర్శలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు మాజీ మంత్రి పేర్ని నాని. పవన్ కళ్యాణ్ గెలిపించిన టీడీపీ ప్రభుత్వం రైతులను దగా చేసింది వాస్తవం కాదా?? ఇప్పుడు రైతుల ఇబ్బందులకు అప్పటి ప్రభుత్వం చేసిన మోసం కాదా?? అప్పుడు రైతుల గురించి ఎందుకు ప్రశ్నించలేని నాని ప్రశ్నించారు. అధికారంలో ఉన్నా… ప్రతిపక్షంలో ఉన్నా వైసీపీని ప్రశ్నించటమే పవన్ కళ్యాణ్ కు తెలుసు. పవన్ కళ్యాణ్ పార్టనర్…
ఏపీలో అయ్యన్న పాత్రుడి ఇష్యూ పొలిటికల్ హీట్ ను పెంచింది. అధికార వైఎస్సార్సీపీ, ప్రతిపక్ష టీడీపీల మధ్య మాటల యుద్ధాన్ని పెంచింది. దీంతో ఇరు పార్టీ నాయకులు ఈ వ్యవహారంలో విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకుంటున్నారు. నర్సీపట్నంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇప్పటికే పోలీసులు అయ్యన్న పాత్రుడి ఇంటిని చుట్టుముట్టారు. కాగా అయ్యన్న అరెస్ట్ కు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. పంట కాలువలను ఆక్రమించుకొని గోడ కట్టడంతో వివాదం రాజుకుంది. అయ్యన్న పాత్రుడి ఇంటి ఆక్రమణలను కూల్చివేయడం…
అయ్యన్న పాత్రుడి విషయంలో చట్టం తనపని తాను చేసుకుపోతుందని.. మంత్రి కారుమూరి నాగేశ్వర్ రావు అన్నారు. చట్టానికి ఎవరూ అతీతులు కాదని ఆయన అన్నారు. చంద్రబాబు అసలు ఏ పార్టీ నుంచి వచ్చారని.. ప్రశ్నించారు. టీడీపీలోకి వెళ్లి ఆ పార్టీని, ఆ పార్టీ బ్యాంక్ బ్యాలెన్స్ ను కబ్జా చేసిన వ్యక్తి చంద్రబాబు అంటూ విమర్శించారు. చంద్రబాబు తరహాలోనే అయ్యన్న పాత్రుడు నడుస్తున్నాడని విమర్శించాడు. మీరు తప్పు చేసి దాన్ని బీసీలపై రుద్దటం ఏంటని ప్రశ్నించారు. బీసీలు…
సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి.. వరుస ట్వీట్లతో చెలరేగిపోతున్నారు.. టీడీపీ అధినేత చంద్రబాబు, ఆ పార్టీ నేతలను టార్గెట్ చేస్తూ.. సెటైర్లు వేస్తూ ట్విట్టర్లో మంట పెడుతున్నారు. మరోవైపు, అదే స్థాయిలో టీడీపీ నుంచి సాయిరెడ్డి ట్వీట్లకు కౌంటర్లు కూడా పడుతున్నా.. ఆయన ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు.. ఇక, తన తాజా ట్వీట్లో.. టీడీపీ అంటే తెలుగు దున్నపోతుల పార్టీ అంటూ కొత్త అర్థం చెప్పారు…
టీడీపీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యలపై సెటైర్లు వేస్తూనే కౌంటర్ ఎటాక్ దిగారు మంత్రి బొత్స సత్యనారాయణ.. చంద్రబాబు నా నియోజకవర్గానికి వెళ్ళి… నేను వ్యక్తిగతంగా పనికి మాలిన వ్యక్తి అన్నట్లు మాట్లాడాడరు.. పనికి మాలినతనానికి చంద్రబాబుదే పేటెంట్ హక్కు అని.. ప్రపంచంలో చంద్రబాబు కంటే పనికి మాలిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా..? రాష్ట్రానికి సంబంధించి ఒక్కటైనా పనికి వచ్చే విషయం మాట్లాడారా..? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ఇక, ఏపీ సర్కార్-బైజూస్ ఒప్పందంపై చంద్రబాబు చేసిన కామెంట్లుకు…