AP Cabinet Meeting: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీ ముగిసింది. ఈ సమావేశంలో తాజా రాజకీయ పరిస్థితులపై మంత్రులకి దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మంత్రులు ఫైల్ క్లియరెన్స్ లో ఆరు రోజుల కంటే ఎక్కువ సమయం తీసుకోకూడదు అని సూచించారు. ఇక, మహిళా క్రికెటర్ శ్రీ చరణ్ కి 2.50 కోట్ల నిధులు, వైజాగ్ లో 500 చదరపు గజాల స్థలం కేటాయింపుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
Read Also: Local Body Elections: ముగిసిన మొదటి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్.. సాయంత్రం ఫలితాలు
అలాగే, పార్లమెంట్ పరిధిలో త్రిమెన్ కమిటీని సీఎం చంద్రబాబు ఏర్పాటు చేశారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో మంత్రులు, త్రీ మెన్ కమిటీలతో సాయంత్రం సమావేశం అవుతానని పేర్కొన్నారు. ఈ మేరకు నామినేటెడ్, పార్టీ పదవులు ఫైనల్ చేయనున్నారు. గోదావరి పుష్కరాలపై చర్చించి.. పనులకు కావాల్సిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అలాగే, ఈ నెల 17, 18వ తేదీల్లో కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహణపై సీఎం చంద్రబాబు దిశా నిర్దేశం చేశారు.
ఇక, గ్రీవెన్స్ లో స్పీడ్ గా ఉండాలని అధికారులకు సీఎం చంద్రబాబు తెలిపారు. అలాగే, టెంపుల్- టూరిజం డెవలప్మెంట్ అయ్యే అవకాశం ఉంది అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచించారు. టూరిజంలో స్పీడ్ పెంచే విధంగా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశాలు ఇచ్చారు.