Nellore: నెల్లూరు కార్పొరేషన్ లో హైడ్రామా కొనసాగుతుంది. డిసెంబర్ 18వ తేదీన మేయర్ స్రవంతి పై అవిశ్వాస తీర్మానం కోసం కౌన్సిల్ సమావేశానికి నిర్ణయం తీసుకుంది. నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో 53 మంది కార్పొరేటర్లు ఉండగా.. గత ఎన్నికల్లో మొత్తం స్థానాలను ఫ్యాన్ పార్టీ గెలిచింది. ఎన్నికల తర్వాత 40 మంది సభ్యులు టీడీపీలో చేరారు. మేయర్ తటస్థంగా ఉండటంతో.. టీడీపీలో 36 మంది సభ్యులు, నిన్న జగన్ సమక్షంలో చేరిన సభ్యులతో కలిపి వైసీపీ సంఖ్య 16 మందికి చేరుకుంది.
Read Also: Panchayat Polls: తొలి దశ ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా.. బీఆర్ఎస్, బీజేపీకి ఎన్ని సీట్లు వచ్చాయంటే..?
అయితే, వైసీపీ తరపున 20 మంది సభ్యులు ఉంటే అవిశ్వాసం వీగిపోనుంది. దీంతో వైసీపీ వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తుంది. భూ ఆక్రమణ కేసులో నిన్న వైసీపీలో చేరిన ఓబుల రవిచంద్రను పోలీసులు అరెస్టు చేశారు. ఇక, రాత్రి పోలీస్ స్టేషన్ ఎదుట మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి ఆందోళన చేపట్టారు. ఓటమి భయంతోనే టీడీపీ అరాచకాలకు పాల్పడుతోందని వ్యాఖ్యానించారు.
Read Also: Suryakumar Yadav: ప్లాన్ బీ లేదు.. ఓటమికి నేనే బాధ్యుడిని!
ఇక, వైసీపీ శ్రేణులు తమ సభ్యులపై బెదిరింపులకు పాల్పడుతోందని టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ఆరోపణలు చేశారు. ఈ అంశంపై వేదాయపాలెం పోలీస్ స్టేషన్ లో టీడీపీ కార్పొరేటర్ ఫిర్యాదు చేశారు. ఇక, తమ సభ్యులను క్యాంప్ కు ఇప్పటికే తరలించింది టీడీపీ.