Thopudurthi Prakash Reddy: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్రపై సెటైర్లు వేశారు రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి.. తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి చేపట్టిన ప్రజా సంక్షేమ పాదయాత్రకు సంఘీభావం తెలిపారు రాస్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి.. ఈ సందర్భంగా తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. లోకేష్ పాదయాత్ర వెల వెల పోతుంటే ఎమ్మెల్యే పెద్దారెడ్డి యాత్ర గ్రాండ్ సక్సెస్ గా సాగిందన్నారు..…
Minister RK Roja: వైసీపీ నేతలు ఓట్లు అడగడానికి వస్తే చీపుర్లతో కొట్టాలంటూ టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేసిన కామెంట్లపై ఘాటుగా స్పందించారు మంత్రి ఆర్కే రోజా.. అసలు వైసీపీ నేతలపై ఎందుకు చీపుర్లు వాడాలని ఆమె ప్రశ్నించారు.. అమ్మఒడి, చేదోడు, ఆసరా వంటి వాగ్దానాలు నెరవేర్చినందుకు? వైసీపీ నేతలపై చీపుర్లు వాడాలా? ఆదర్శప్రాయమైన విద్యా విధానాలు మరియు పథకాలు అమలు చేస్తున్నందుకు చీపుర్లతో కొట్టాలా? డ్వాక్రా రుణాలపై టీడీపీ వైఫల్యాలను బయటపెట్టినందుకా? అంటూ…
Off The Record: నెల్లూరు జిల్లాలో ఎమ్మెల్యే కోటంరెడ్డి ఎపిసోడ్ తర్వాత వివిధ జిల్లాల్లో వైసీపీ నేతల పనితీరుపై స్థానికంగా ఎక్కడికక్కడ చర్చ జరుగుతోంది. పైకి చెప్పేదొకటి.. తెరవెనుక మరొకటి చేస్తున్న నేతల గురించి టాక్ నడుస్తోంది. ఇదే తరహాలో ఉమ్మడి కృష్ణా జిల్లాలోని ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌పై ఫోకస్ నెలకొంది. గత ఎన్నికల్లో బిగ్ షాటైన దేవినేని ఉమా మహేశ్వరరావును ఓడించడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించారు మైలవరం ఎమ్మెల్యే వసంత. ఇప్పుడు ఆయన తీరు…
Off The Record: డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కీలక నియోజకవర్గం కొత్తపేట. ఇక్కడ తెలుగుదేశం, జనసేన పార్టీలకు సొంత అన్నదమ్ములే ఇంఛార్జీలు. వారే మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందం.. బండారు శ్రీనివాస్. ఇద్దరికీ అస్సలు పడటం లేదు. ఒక చిన్న వివాదం అపోహలతో పెరిగి పెద్దదై పరస్పరం పోటీకి దిగే స్థాయికి చేరింది. 2019 ఎన్నికల్లో ఇద్దరూ అదే చేశారు. వచ్చే ఎన్నికల్లోనూ టీడీపీ నుంచి సత్యానందం.. జనసేన నుంచి శ్రీనివాసరావు బరిలో ఉండాలని చూస్తున్నారు.…
Polavaram Project: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టుపై కీలక ప్రకటన చేసింది కేంద్రం.. పోలవరం ప్రాజెక్టును మార్చి 2024 కల్లా పూర్తి చేయాలన్నది లక్ష్యంగా ప్రకటించారు కేంద్ర జల శక్తి శాఖ సహాయ మంత్రి బిశ్వేశ్వర్ తుడు.. దీని కోసం జూన్ 2024 కల్లా డిస్ట్రిబ్యూటరీ నెట్వర్క్ పూర్తి చేయాలన ఆదేశాలు జారీ చేశారు.. అయితే, గోదావరి నదికి ఇటీవల వచ్చిన వరదల కారణంగా కొంత ఆలస్యమయ్యే అవకాశం ఉందన్నారు.. తెలుగు దేశం…
Political Heat in Nellore: నెల్లూరు జిల్లాలో వైసీపీ నేతలు, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి మధ్య మాటలయుద్ధం కొనసాగుతోంది. ఆరోపణలు, ప్రత్యారోపణలతో…పాలిటిక్స్‌ను తారాస్థాయికి తీసుకెళ్లారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు ట్రాప్‌లో పడి అవాస్తవ ఆరోపణలు చేస్తున్నారంటూ… కోటంరెడ్డిపై మంత్రి కాకాణి ఆరోపించారు. కాకాణి వ్యాఖ్యలకు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఘాటుగా సమాధానమిచ్చారు. అధికార పక్షం నుంచి ప్రతిపక్షానికి వద్దామనుకుంటే నమ్మక ద్రోహమా? అని ప్రశ్నించారు. వైఎస్ కుటుంబానికి మీరు వీరవిధేయుడైతే వైఎస్ విగ్రహాన్ని పెట్టేందుకు ప్రయత్నిస్తే… ఎందుకు అడ్డుకున్నారని నిలదీశారు.…
Jr.NTR Political Entry: తెలుగుదేశం పార్టీ, జూనియర్ ఎన్టీఆర్ పొలిటిక్ ఎంట్రీపై సంచలన వ్యాఖ్యలు చేశారు లక్ష్మీపార్వతి.. ఇప్పుడు తెలుగు దేశం పార్టీలోకి జూనియర్ ఎన్టీఆర్ వచ్చినా లాభం లేదన్నారు.. ఇప్పటికే చాలా ఆలస్యం అయ్యిందన్న లక్ష్మీపార్వతి.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి లాగా.. జనంలో ఉంటే ఐదేళ్ల తర్వాత జూనియర్ ఎన్టీఆర్‌కు అవకాశం ఉండొచ్చు అని వ్యాఖ్యానించారు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ వచ్చినా తెలుగుదేశం పార్టీని ఏమీ చేయలేరన్న లక్ష్మీపార్వతి.. ఇకవేళ జూనియర్…
Off The Record: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి వచ్చే ఎన్నికల్లో టీడీపీ టికెట్‌పై పోటీ చేస్తానని అనుచరులకు చెప్పేశారు. ఆయన అలా అన్నారో లేదో అధికారపార్టీ వైసీపీ ఆయన అధికారాలను కత్తెరించి.. రూరల్ ఇంఛార్జ్‌గా ఆదాల ప్రభాకర్‌రెడ్డి పేరును ప్రకటించింది. ఈ మొత్తం ఎపిసోడ్లో స్పందించంది నెల్లూరు జిల్లా టీడీపీ నేతలే. అలాగే కోటంరెడ్డిని ఆహ్వానిస్తూ టీడీపీ పెద్దల నుంచి ఎలాంటి ప్రకటన లేకపోవడంతో ఎమ్మెల్యే శిబిరంలోనూ ఆందోళన కనిపిస్తోందట. నెల్లూరు జిల్లా టీడీపీలో…
Off The Record: నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవి ఫ్యామిలీ టీడీపీతో టచ్‌లో ఉందని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలే నెల్లూరు వైసీపీ రాజకీయాలపై రాష్ట్రంలో వాడీవేడీ చర్చ జరుగుతున్న తరుణంలో ఆమె చేసిన కామెంట్స్‌కు ప్రాధాన్యం సంతరించుకుంది. అదే సమయంలో నంద్యాల రాజకీయాలు కూడా హీటెక్కాయి. మాజీ మంత్రి వ్యాఖ్యలు టీడీపీ, వైసీపీ శిబిరాల్లో ఆసక్తికర చర్చకు తెరతీశాయనే చెప్పాలి. నిజంగానే శిల్పా కుటుంబం టీడీపీతో టచ్‌లో ఉందా? లేక…