Threatening calls: నెల్లూరు రాజకీయాల్లో కాకరేపిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డికి ఇప్పుడు బెదిరింపుల పర్వం మొదలైందట.. తన ఫోన్ ట్యాపింగ్ చేశారని.. ఆరోపణలు చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వెళ్లిన ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి కడప జిల్లా నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. కడప జిల్లాకు చెందిన అనిల్ అనే వ్యక్తి కోటంరెడ్డికి ఫోన్ చేసి తీవ్రస్థాయిలో హెచ్చరికలు చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో పాటు ప్రభుత్వ సలహాదారు సజ్జల…
Kotamreddy Sridhar Reddy: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి వరుస షాక్‌లు తగులుతున్నాయి.. ట్యాపింగ్ ఆరోపణలు చేసిన కోటంరెడ్డిపై ఎదురుదాడికి దిగిన వైసీపీ.. ఆ తర్వాత పక్కన పెట్టేంది.. అయితే.. ఇప్పుడు కోటంరెడ్డికి కార్పొరేటర్లు షాక్ ఇస్తున్నారు. ఇంతవరకు ఆయనకు మద్దతుగా నిలిచిన జిల్లా పార్టీ మహిళా అధ్యక్షురాలు, 23 డివిజన్ కార్పొరేటర్ మొయిల్ల గౌరీతోపాటు మరో కార్పొరేటర్ మూలే విజయ భాస్కర్ రెడ్డిలు.. కొత్తగా నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి వైసీపీ ఇంచార్జ్‌గా వచ్చిన…
Ambika Krishna: టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అంబికాకృష్ణ.. ఆనాడు ఫిల్మ్ కార్పొరేషన్ చైర్మన్ గా నాకు అవకాశం ఇచ్చారు.. కానీ, ఎన్నోసార్లు నంది అవార్డులు ఇవ్వాలని అప్పటి సీఎం చంద్రబాబును అడిగా.. కానీ, ఏనాడు స్పందించలేదని విమర్శించారు.. స్టూడియోల కోసం మంచి స్థలాలు ఉన్నా.. ముందుకు వెళనివ్వలేదన్న ఆయన.. ఎక్కడా చంద్రబాబు సహకరించలేదని మండిపడ్డారు.. మనం ఎన్ని ప్రయాత్నలు చేసిన పైనున్న వారికి ఆసక్తి ఉండాలి కదా? అని ప్రశ్నించారు.…
Taraka Ratna Health Update: బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నందమూరి తారకరత్నను విదేశాలకు తరలించే ఆలోచనలో కుంటుంబ సభ్యులు ఉన్నారని తెలుస్తోంది.. తారకరత్న ఆరోగ్య పరిస్థితి ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన హిందూపూర్ పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి అంబికా లక్ష్మీనారాయణ.. తారకరత్నను ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ దగ్గరుండి చూసుకుంటున్నారని తెలిపారు.. ఈరోజు తారకరత్న మెదడుకు సంబంధించిన స్కాన్ తీశారు.. ఈ రోజు వచ్చే రిపోర్టులను బట్టి మెదడు పరిస్దితి అర్థం అవుతుందని..…
Shilpa vs Bhuma: నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవి చంద్ర కిషోర్ రెడ్డికి మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ తాజాగా సవాల్ విసిరిన విషయం విదితమే.. తమపై చేసిన ఆరోపణలు నిరూపించాలన్న ఆమె.. ఆధారాలతో చర్చకు రావాలని చాలెంజ్ చేశారు.. లేనిపక్షంలో బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.. ఇక, శిల్పా రవి టీడీపీ వైపు చూస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు భూమా అఖిల ప్రియ.. అయితే, భూమా అఖిల ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు ఎమ్మెల్యే…
Off The Record: ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం.. ఏపీలోనే కాస్ట్లీయస్ట్ నియోజకవర్గంగా పేరున్న ఈ నియోజకవర్గంలో గత ఎన్నికల వరకు గ్రానైట్ కింగ్లే రెండు పార్టీల తరఫున బరిలో నిలిచేవారు. అయితే గత ఎన్నికల్లో అనూహ్య పరిణామాల కారణంగా గ్రానైట్ నేపథ్యం లేని మద్దిశెట్టి వేణుగోపాల్, కదిరి బాబూరావులు వైసీపీ, టీడీపీ తరఫున బరిలో నిలిచారు. ఫ్యాను గాలిలో మద్దిశెట్టి బంపర్ మెజారిటీతో గెలిచారు. ఆ తర్వాత కదిరి బాబూరావు నియోజకవర్గానికి ముఖం చాటేసి… కొన్నాళ్లకు…
BRS in AP: టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చేసి జాతీయ రాజకీయాల్లో అడుగులు వేస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు.. వివిధ రాష్ట్రాల్లో పార్టీ విస్తరణపై ఫోకస్ పెట్టారు.. కలిసి వస్తున్న నేతలకు కండువాలు కప్పి.. పార్టీ బాధ్యతలు అప్పగిస్తున్నారు.. ఇక, పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్‌లోనూ ఇప్పటికే బీఆర్ఎస్కు బీజం పడగా.. మరికొందరు నేతలను ఆహ్వానించేపనిలో పడిపోయారు.. అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు, మాజీలు కూడా పార్టీలో చేరతారని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నమాట.. దీంతో, తెలంగాణ…
Anil Kumar Yadav: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు వైసీపీలో కలకలం రేపాయి.. చంద్రబాబు, లోకేష్‌తో టచ్‌లోకి వెళ్లిన కోటంరెడ్డి.. ఉద్దేశ్యపూర్వకంగానే ఈ ఆరోపణలు చేస్తున్నారని అధికార పార్టీ నేతలు మండిపడుతున్నారు. అయితే, అది ట్యాపింగ్ కాదు.. ఫోన్ రికార్డింగ్ అని కొట్టిపారేస్తున్నారు.. ఇక, ఈ వ్యవహారంలో మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ రాజీనామా సవాల్ విసిరారు.. ఫోన్ ట్యాపింగ్ జరిగిందని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి…
Deputy CM Narayana Swamy: సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డితో పెట్టుకున్న వాళ్లంతా రాజకీయ సన్యాసం పుచ్చుకున్నారు.. జగన్‌కు ద్రోహం చేసినవాళ్లు పుట్టగతులు లేకుండా పోతారంటూ వ్యాఖ్యానించారు డిప్యూటీ సీఎం నారాయణస్వామి.. చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలం మారేపల్లి గ్రామంలో గడపగడపకి మన ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వైసీపీలో ఉంటూ జగనన్నకు ద్రోహం చేసే వాళ్ళు పుట్టగతులు లేకుండా పోతారని హెచ్చరించారు.. సోనియా గాంధీ, కిరణ్ కుమార్ రెడ్డి ,చంద్రబాబు నాయుడు, ఎర్రమునాయుడు…