Thopudurthi Prakash Reddy: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్రపై సెటైర్లు వేశారు రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి.. తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి చేపట్టిన ప్రజా సంక్షేమ పాదయాత్రకు సంఘీభావం తెలిపారు రాస్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి.. ఈ సందర్భంగా తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. లోకేష్ పాదయాత్ర వెల వెల పోతుంటే ఎమ్మెల్యే పెద్దారెడ్డి యాత్ర గ్రాండ్ సక్సెస్ గా సాగిందన్నారు.. లోకేష్ పాదయాత్రకు తెలుగుదేశం నాయకులు ఎవరు కూడా సంఘీభావం తెలపడం లేదని విమర్శలు గుప్పించారు.. ఆ పరిస్థితి చూస్తుంటే.. అసలు తెలుగుదేశం పార్టీ ఉందా? ఏపీలో అనే సందేహం కలుగుతుందన్నారు. చంద్రబాబు నాయుడు కుమారుడి పాదయాత్రకే ఈ పరిస్థితి ఉంటే.. పార్టీ పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు అన్నారు తోపుదుర్తి.
Read Also: PM Narendra Modi: కాంగ్రెస్ పాలన అంతా ఉగ్రవాదం.. కుంభకోణాలే..
ఇక, లోకేష్ పాదయాత్ర ద్వారా తెలుగుదేశం పార్టీకి పాడే యాత్ర లాగా కొనసాగుతోందని.. తన పాదయాత్రతో లోకేష్.. టీడీపీకి పాడే కట్టేశారంటూ హాట్ కామెంట్లు చేశారు రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి. కాగా, తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి చేపట్టిన ప్రజా సంక్షేమ పాదయాత్ర ముగిసింది.. 11 రోజుల పాటు 110 కిలోమీటర్ల మేర పెద్దవడుగూరు మండలంలో ఈ యాత్ర కొనసాగింది.. యాత్ర ముగింపు సభలో ఎమ్మెల్యే అనంతవెంకటరామిరెడ్డి, జడ్పీ ఛ్తెర్మన్ గిరిజమ్మ, మార్కెట్ యార్డు ఛ్తెర్మన్లు, తదితరలు పాల్గొన్నారు. అయితే, చిత్తూరు జిల్లాలో నారా లోకేష్ పాదయాత్ర కొనసాగుతోంది.. చిత్తూరు నియోజకవర్గం పాదయాత్ర పూర్తి చేసుకుని.. గంగాధర నెల్లూరు లోకి ప్రవేశించిన నారా లోకేష్ యువగళం పాదయాత్ర.