JC Prabhakar Reddy: అధికారులంతా కేసుల్లో ఇరుక్కుంటారు.. జేసీ వార్నింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
JC Prabhakar Reddy: జేసీ ట్రావెల్స్‌పై పలు కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే.. తప్పుడు సమాచారం ఇచ్చి, ఫోర్జరీలకు పాల్పడ్డారని.. రవాణా శాఖ ఫోర్జరీ సంతకాలు, దొంగ స్టాంపులు, నకిలీ పత్రాలతో అధికారులను మోసం చేస్తూ అక్రమాలకూ పాల్పడ్డారన్న ఆరోపణలతో కేసులు పెట్టారు.. తాజాగా మరో వ్యవహారంలో జేసీ ప్రభాకర్‌రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు అయ్యింది.. అయితే, ఇవాళ మీడియాతో మాట్లాడిన తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి.. నకిలీ ఇన్సూరెన్స్ లు పెడితే వాహనాలు ఎలా రిజిస్ట్రేషన్లు చేశారు? అని ప్రశ్నించారు.. దానికి అదనంగా కేసులు పెట్టారు.. కేవలం పేపర్లు ఇస్తే రిజిస్ట్రేషన్లు ఎలా? చేస్తారు అని నిలదీశారు.. 28 వాహనాలకు వందకు పైగా కేసులు పెట్టారని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన.. డీటీ కి అసలు కేసులు పెట్టే అధికారం లేదు.. కానీ, ఆయనపై ఒత్తిళ్లు చేశారు.. కేసులు పెట్టించారని ఆరోపించారు..
Read Also: Woman Falls Under Train: రైల్వే ట్రాక్ దాటేందుకు ప్రయత్నించింది.. కానీ ఇంతలోనే..
Also Read
- Pawan Kalyan: అడవి తల్లి బాట 2.0 కార్యక్రమం ప్రారంభం.. స్థానిక ఎన్నికల్లో కూటమి సత్తా చాటాలి.!
- Chiranjeevi: వయసు ఒక నంబర్ మాత్రమే..! ప్రేమ, అభిమానమే నాకు ఎనర్జీ..
- BC Reservations: సర్కార్ కీలక ఉత్తర్వులు.. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లకు గ్రీన్ సిగ్నల్..!
- Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
అయితే, మొత్తం అధికారులంతా ఈ కేసుల్లో ఇరుక్కుంటారు అంటూ హెచ్చరించారు జేసీ ప్రభాకర్‌రెడ్డి. మరోవైపు.. తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డిపై ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు జేసీ… పెద్దారెడ్డి ఒక పిచ్చోడు అని మండిపడ్డారు.. ఇక, ధర్మవరం ఎమ్మెల్యే బైక్ రేస్ లు, గుర్రాల రేస్ లు చేసుకో.. అది కూడా కాకపోతే నీ నియోజకవర్గంలో గుడ్ మార్నింగ్ కార్యక్రమాలు చేసుకో.. అంతే కానీ, ప్రతీ విషయంలో మమ్మల్ని టార్గెట్ చేయొద్దని హితవుపలికారు జేసీ ప్రభాకర్‌రెడ్డి.. కాగా, తాజాగా టీడీపీ సీనియర్ నేత, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డిపై మరో కేసు నమోదు అయ్యింది.. ఈ సారి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు పోలీసులు.. అనంతపురం జిల్లా పెద్దపప్పూరు పెన్నానది సమీపంలో అక్రమ ఇసుక తవ్వకాలకు వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు జేసీ ప్రభాకర్ రెడ్డి.. మైనింగ్ నిబంధనలకు విరుద్ధంగా పెన్నానది నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారంటూ ఆరోపించారు జేసీ.. అయితే, ఈ క్రమంలో ఇసుక రీచ్ వద్ద జేసీ ప్రభాకర్ రెడ్డి కూలం పేరుతో దూషించారంటూ వీరాంజనేయులు అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు.. దీంతో, జేసీ ప్రభాకర్‌రెడ్డిపై పెద్దపప్పూరు పోలీసుస్టేషన్‌లో పెద్దపప్పూరు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది..
తాజావార్తలు
-
CM Revanth Reddy : రేవంత్ రెడ్డి గోవా పర్యటన.. కాంగ్రెస్ యాత్రలో కీలక పాత్ర
-
దసరాకు RC17 గ్రాండ్ లాంచ్! చరణ్ పక్కన ఆ హీరోయిన్.. నిజమేనా?
-
IAF Chief: “F-35 దగ్గరకు కూడా రానివ్వరు.. అమ్ముతామని మాత్రం చెబుతున్నారు” .. అమెరికా పరువు తీసిన IAFచీఫ్..
-
Lockie Ferguson: ‘వైభవ్ సూర్యవంశీకి ఓపెన్ ఛాలెంజ్’.. మా దేశంలో చూసుకుందాం..
-
Dhruv Rathee: “గూండాలు నన్ను కిడ్నాప్ చేశారు”.. విడుదల తర్వాత ధ్రువ్ రాఠీ సంచలన ఆరోపణలు
ట్రెండింగ్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!