Gudivada Amarnath: నారా లోకేషే వైసీపీ స్టార్ క్యాంపెయినర్.. ఆయన ఎంత తిరిగితే మాకు అంత ప్రయోజనం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gudivada Amarnath: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పేరుతో చేపట్టిన పాదయాత్రపై మరోసారి సెటైర్లు వేశారు ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్.. ఢిల్లీలో ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆయన.. శివరామకృష్ణన్ కమీటీ నివేదిక రాక ముందే, రాష్ట్ర రాజధానిపై చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు.. ప్రభుత్వం సహకరించాలని నారా లోకేష్ పదే పదే అనడంలో ఉద్దేశం ఏమిటి..!? అని ఎద్దేవా చేశారు.. అసలు లోకేష్ పాదయాత్రకు ప్రజలు ఎవరూ రావడం లేదు.. ఆ పాదయాత్రకు ఏమైనా వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను పంపాలా..? అంటూ పంచ్‌లు విసిరారు.. లోకేష్ యాత్ను చూసి చంద్రబాబే సైకో అయ్యారని వ్యాఖ్యానించారు. రానున్న ఎన్నికల్లో వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ కి “స్టార్ కాంపైనర్” లోకేషే.. రాష్ట్రంలో నారా లోకేష్ ఎంత తిరిగితే వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంత ప్రయోజనం కలుగుతుందని వ్యాఖ్యానించారు మంత్రి గుడివాడ అమర్నాథ్.
Read Also: Minister KTR: ప్రతి నియోజకవర్గం నుంచి పదివేల మంది రావాలి
Also Read
- Certificates Verifications: ఏపీ సర్కార్ కీలక ఆదేశాలు.. సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌లో మార్పులు..
- Promotions: శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఆ ఉద్యోగుల ప్రమోషన్లకు గ్రీన్‌సిగ్నల్..
- Brave Head Constable: తమిళనాడులో రెచ్చిపోయిన గుట్కా ముఠాలు.. సినిమా రేంజిలో ఛేజింగ్..
- Land Fraud: కృష్ణా జిల్లాలో సంచలనం.. ఇలా కూడా స్థలాలు కబ్జా చేస్తారా?
కాగా, గతంలోనూ లోకేష్ పాదయాత్రపై సెటైర్లు వేశారు మంత్రి అమర్నాథ్.. లోకేష్ పాదయాత్ర కాదు కదా పాక్కునే యాత్ర చేసినా ఏపీలో టీడీపీ అధికారంలోకి రాదని స్పష్టం చేశారు.. అసలు పాదయాత్ర చేయడానికి నారా లోకేష్ కి ఉన్న అర్హత ఏంటని నిలదీసిన ఆయన.. పాదయాత్రలు వైఎస్ ఫ్యామిలీ పేటెంట్ హక్కు అని చెప్పారు. ఎందుకీ యాత్ర..? అసలు నారా లోకేష్ పాదయాత్రకు అర్థమేముందని ప్రశ్నించారు మంత్రి గుడివాడ అమర్నాథ్. గతంలో వైఎస్ఆర్, జగన్ చేసిన పాదయాత్రలకు ఓ అర్థం ఉందని, అవినీతి పాలన నుంచి ప్రజలకు విముక్తి కలిగించాలని, ప్రజలతో మమేకమై కష్టసుఖాలు తెలుసుకోవాలనే ఉద్దేశంతో వారు పాదయాత్రలు చేశారని చెప్పుకొచ్చారు. జగన్ పాలనలో ప్రజలంతా సుభిక్షంగా ఉన్నారని, మూడున్నరేళ్ల తర్వాత ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రజల్లోకి వెళ్తుంటే వారు బ్రహ్మరథం పడుతున్నారని చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో అసలు పాదయాత్ర చేయాల్సిన అవసరం లోకేష్ కి ఏమొచ్చిందంటూ గతంలో మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రశ్నల వర్షం కురిపించిన విషయం విదితమే.
తాజావార్తలు
-
BAR Tender: తెలంగాణలో 41 కొత్త బార్లు.. దరఖాస్తులకు నోటిఫికేషన్
-
Shai Hope: మమ్మల్ని దారుణంగా ముంచేశారు.. ఇలా ఆడతారని అస్సలు ఊహించలేదు: వెస్టిండీస్ కెప్టెన్
-
Nani: “18 ఏళ్ల కెరీర్.. 33 సినిమాలు.. ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు” ది ప్యారడైజ్ టాక్‌పై నాని ఓపెన్ రియాక్షన్!
-
Ind Vs WI: కోహ్లీ, గిల్ మానియా.. 295 రన్స్ ఉఫ్.. భారత్ ఘన విజయం..
-
LPU Students Protest: పంజాబ్ LPUలో ఆరని మంటలు.. స్టూడెంట్స్, పోలీసుల మధ్య ఉద్రిక్తత..
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?