స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారు కాబట్టే అరెస్ట్ చేశారని మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పని చేసిన వ్యక్తిని.. స్కిల్ డెవలప్మెంట్కేసులో నిందితుడిగా న్యాయస్థానం నిర్ధారించిందన్నారు. బంద్‌కు పిలుపునిస్తే ప్రజల్లో స్పందన లేదన్నారు.
చంద్రబాబు అరెస్ట్‌ను రాజకీయ కుట్రగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారని మంత్రి సీదిరి అప్పలరాజు తీవ్రంగా మండిపడ్డారు. ఈ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ యువకులకు సంబంధించిందని.. ఎవరికీ ట్రైనింగ్ ఇవ్వకుండా , ఇన్స్టిట్యూట్ కట్టకుండా డబ్బులు కొల్లగొట్టారని ఆయన విమర్శించారు. అవినీతి జరిగిందా లేదా అనేది చూడాలన్నారు. అవినీతి చేసిన వారు ఎవరైనా శిక్షింపబడాల్సిందేనన్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి ఆర్కే రోజా తీవ్రంగా మండిపడ్డారు. స్కిల్ స్కామ్ పాత్రధారి, సూత్రధారి చంద్రబాబేనని రోజా ధ్వజమెత్తారు. చంద్రబాబు తన అధికారాన్ని దోపిడీ కోసమే ఉపయోగించుకున్నారని విమర్శించారు. అధికారాలున్నాయి కాబట్టే కోర్టు రిమాండ్‌కు పంపిందని తెలిపారు.
స్కిల్ డెవలప్మెంట్ కేసులో సీఐడీ తనను అక్రమంగా అరెస్టు చేసిందని ఆరోపిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబుకి వైసీపీ నేత పేర్ని నాని కౌంటర్ ఇచ్చారు. సంకల్పంతో పని చేసిన, బలమైన, పట్టుదలతో పనిచేసిన అధికారి చేతిలో చంద్రబాబు దొరికిపోయారని ఆయన తెలిపారు.
టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌పై మంత్రి అంబటి రాంబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక పొలిటీషియన్ అరెస్ట్ కావడం, జైలుకు వెళ్లడం బాధాకరమే. అయితే ఆ పొలిటీషియన్ ఎలాంటి వ్యక్తి, రాజకీయ జీవితం ఏంటనేది కూడా చూడాలని ఆయన పేర్కొన్నారు.
ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబును జైలుకు తరలించడంపై రాష్ట్రంలో టీడీపీ భగ్గమంటోంది. చంద్రబాబు అరెస్ట్‌నకు నిరసన టీడీపీ సోమవారం రాష్ట్ర వ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చింది. దీంతో తెల్లవారు జాము నుంచే టీడీపీ శ్రేణులు బయటకు వచ్చి తమ నిరసన పాటిస్తున్నారు. మరోవైపు పోలీసులు టీడీపీ నేతలను ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు.
చంద్రబాబుకు ఏసీబీ కోర్టు రిమాండ్ విధించిన తర్వాత జనసేనాని పవన్ కల్యాణ్ స్పందించారు. రెండేళ్లు జైలుకు వెళ్లిన వ్యక్తి, రిచెస్ట్ సీఎం.. కానీ ఏమి పని చేశాడో తెలియదని విమర్శించారు. హఠాత్తుగా ఆస్తులు పెంచేసుకుని, అక్రమంగా డబ్బులు సంపాదించిన వారంతా రాజ్యాధికారం దక్కించుకున్నారని ఆరోపించారు. ప్రతి ఒక్కరినీ నేరగాళ్లుగా చిత్రీకరించేందుకు ప్రయత్నం చేస్తున్నారని పవన్ కల్యాణ్ తెలిపారు. చంద్రబాబును అరెస్టు చేసిన అంశంలో తన మద్దతు ఉంటుందని చెప్పారు.
చంద్రబాబు జీవితమంతా అక్రమ మార్గాలేనని సజ్జల మండిపడ్డారు. ఈ కుంభకోణానికి రూపకర్త, నిర్మాత, దర్శకత్వం అన్నీ చంద్రబాబేనని ఆరోపించారు. ఈ కేసులో చంద్రబాబుకు వ్యతిరేకంగా బలమైన సాక్ష్యాధారాలు ఉన్నందునే నిన్న(శనివారం) అరెస్ట్ చేశారని సజ్జల స్పష్టం చేశారు.