జగన్ 16 నెలలు జైల్లో ఉండటం వలన కక్ష సాధింపు చర్యలతో అక్రమ అరెస్ట్ చేయించారని ఎమ్మెల్యే బాలకృష్ణ ఆరోపించారు. చంద్రబాబు నాయుడుని పది నిమిషాలు అయినా సరే జైల్లో పెట్టాలని ఉద్దేశంతో అరెస్ట్ చేశారని తెలిపారు.
చంద్రబాబు అరెస్ట్ పై ఉదయం నుంచి వైసీపీ నేతలు తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా చంద్రబాబును సీఐడీ ప్రశ్నిస్తుంది. మరోవైపు చంద్రబాబు అరెస్ట్ పై మంత్రి ఆర్కే రోజా తీవ్ర స్థాయిలో కామెంట్స్ చేశారు. చంద్రబాబు తప్పు చేశాడు కాబట్టే అరెస్టయ్యాడని, అవినీతికి పాల్పడిన వ్యక్తిని జైలుకు పంపించకుండా ఎక్కడకు పంపిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు అరెస్ట్‌తో ఇప్పుడు ఎన్టీఆర్ ఆత్మ సంతోషంగా ఉంటుందన్నారు. ‘పిచ్చోడు లండన్‌కి… మంచోడు జైలుకి… ఇది కదా…
తాడేపల్లి సీఐడీ సిట్ కార్యాలయంలో టీడీపీ అధినేత చంద్రబాబుపై సీఐడీ ప్రశ్నల వర్షం కురిపిస్తోంది. సీఐడీ అడిగే ప్రశ్నలకు చంద్రబాబు సరిగా సమాధానం చెప్పడం లేదని సమాచారం తెలుస్తోంది.
చంద్రబాబును అరెస్ట్ చేయడం సబబే.. స్కీం ను స్కాం గా మార్చారని వెంకటగిరి వైసీపీ సమన్వయకర్త నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. బాబు వస్తే జాబ్ వస్తుందని చెప్పి అధికారంలోకి వచ్చారని దుయ్యబట్టారు.
పవన్ కల్యాణ్ వస్తుంటే మీరు ఎందుకు భయపడుతున్నారని నాదెండ్ల ప్రశ్నించారు. పవన్ కల్యాణ్ వచ్చి మంగళగిరి పార్టీ ఆఫీసులో భవిష్యత్తు కార్యచరణ నిమిత్తం సీనియర్ నాయకులతో సమావేశం నిమిత్తం రానున్నారని తెలిపారు.
చంద్రబాబు అరెస్ట్ పై స్పీకర్ తమ్మినేని సీతారాం కీలక వ్యాఖ్యలు చేశారు. 14 ఏళ్లు సీఎంగా చేసిన వ్యక్తిని అరెస్ట్ చేయాలంటే విచారణ సంస్థలు గుడ్డిగా వెళ్ళిపోవని స్పీకర్ అన్నారు. చట్టంకి ఎవరూ చుట్టం కాదని తెలిపారు.
టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ పై మంత్రి అంబటి రాంబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. సీనియర్ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్టు కావటం దురదృష్టకరమని విమర్శించారు. ఇది అక్రమ అరెస్టు కాదు.. అనివార్యమైన అరెస్టు అన్నారు.
చంద్రబాబు అరెస్ట్ పై వైసీపీ నేతలు తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా విజయనగరంలో మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. స్కిల్ డెవలప్మెంట్లో అవకతవకలు జరిగాయని ఈడీ పేర్కొందని తెలిపారు. చంద్రబాబు అరెస్ట్ రాజ్యాంగబద్ధంగా, చట్టపరంగా జరిగిందని అన్నారు.
Minister kakani Govardhan Comments om Chandra Babu Naidu Arrest: ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ తో రాష్ట్రంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. స్కిల్ డెవలప్ మెంట్ స్కీం లో అవకతవకలకు పాల్పడ్డారంటూ ఈ రోజు ఉదయం చంద్రబాబు నాయుడుని సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ అరెస్ట్ అక్రమం అంటూ టీడీపీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలుపుతున్నాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి, జనసేన అధినేత పవన్ కల్యాణ్…