జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ కలిసే వస్తామని ఆయన ప్రకటించారు. చంద్రబాబుతో ములాఖత్ ఏపీ రాజకీయాల్లో కీలకమైందని, వైసీపీ అరాచకాలను సమిష్టిగా ఎదుర్కోవాలన్నారు. ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి వెళ్తాయని పవన్ కళ్యాణ్ ప్రకటించారు.
అంగళ్లు కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా పడింది. ఈ నెల 20కి ఏపీ హైకోర్టు వాయిదా వేసింది. చంద్రబాబు, ప్రభుత్వ తరపున న్యాయవాదులు వాయిదా కోరటంతో న్యాయస్థానం వాయిదా వేసింది.
చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో నిరసనలు తెలుపుతున్న టీడీపీ నేతల గృహానిర్బంధం పిటిషన్పై ఏపీ హైకోర్టు విచారణ జరిపింది. ఆ పార్టీ నేతలను గృహనిర్బంధం చేయడంపై వినుకొండ మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు పిటిషన్ దాఖలు చేశారు.
టీడీపీ అధినేత చంద్రబాబు క్వాష్ పిటిషన్తో పాటు మరో రెండు పిటిషన్లపై ఏపీ హైకోర్టు విచారణను వాయిదా వేసింది. క్వాష్ పిటిషన్పై విచారణను ఈ నెల 19కి వాయిదా వేసింది. ఈ నెల 18లోపు కౌంటర్ దాఖలు చేయాలని సీఐడీని న్యాయస్థానం ఆదేశించింది.
ఏపీ హైకోర్టులో చంద్రబాబుకు అత్యవసర ఊరట దక్కలేదు. చంద్రబాబు క్వాష్ పిటిషన్పై విచారణను ఉన్నత న్యాయస్థానం వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది. ఇరువైపుల వాదనలు వినాల్సి ఉందని హైకోర్టు పేర్కొంది. కౌంటర్ దాఖలు చేయాలని సీఐడీకి కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి మేయర్ పొట్లూరి స్రవంతి షాక్ ఇచ్చారు. వైసీపీ నుంచి శ్రీధర్ రెడ్డి దూరమైన తర్వాత మేయర్ స్రవంతి ఆయన వైపే నిలిచారు. ఇటీవల కాలంలో శ్రీధర్ రెడ్డి సోదరుడు గిరిధర్ రెడ్డితో మేయర్ స్రవంతికి విభేదాలు తలెత్తాయి.