ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు రోజురోజుకు వేడెక్కుతున్నాయి. టీడీపీ-జనసేన ఉమ్మడి తొలి జాబితాను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో ఎలాగైనా అధికార వైసీపీ ఓడించాలనే లక్ష్యంతో ఇరు పార్టీలు జాబితాను విడుదల చేశాయి. ఈ క్రమంలోనే సీట్లు దక్కని నేతలు అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే రోజంతా బుజ్జగింపులతో చంద్రబాబు బిజీ బిజీగా గడిపారు.
ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యాన్ని ఆర్బీకేల ద్వారా విక్రయించిన రైతులకు.. నెలలు గడుస్తున్నా డబ్బు చెల్లించకపోవడం ప్రభుత్వ చేతగానితనానికి నిదర్శనమని మండిపడ్డారు గన్నవరం నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు. రైతులకు పెండింగ్‌లో ఉన్న ధాన్యం డబ్బును వెంటనే విడుదల చేయటంతో పాటు తుఫాన్ బాధితులకు పంట నష్ట పరిహారం అందించాలని, పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు.
టీడీపీ సీనియర్ నేత ఆలపాటి రాజా చంద్రబాబు ఆయన నివాసంలో కలిశారు. పొత్తులో భాగంగా తెనాలి సీటును జనసేన నేత నాదెండ్ల మనోహర్‌కు కేటాయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెనాలి టీడీపీ ఇన్ఛార్జ్ ఆలపాటి రాజాను ఇంటికి పిలిపించుకుని చంద్రబాబు ఆయనతో మాట్లాడారు.
టీడీపీ- జనసేన పొత్తులో టిక్కెట్ల కేటాయింపుపై రాజమండ్రిలో రాష్ట్ర మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ- జనసేన పార్టీలో సీట్ల ప్రకటన తర్వాత డొల్లతనం బయటపడిందని ఆరోపించారు.
తొలి విడత ప్రకటించిన అభ్యర్థులతో చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు.. తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు. ఎన్నికల ప్రణాళికపై దిశా నిర్దేశం చేశారు చంద్రబాబు. ఎన్నికల వరకు రోజూవారీ చేపట్టాల్సిన ప్రణాళికపై చర్చ, ఎన్నికల వరకు ప్రతి వారం రోజులకు ఓ సర్వే చేపడతామని చంద్రబాబు వెల్లడించారు. సర్వేల్లో ఏమైనా తేడా వస్తే.. అభ్యర్థులను మార్చేందుకూ వెనుకాడబోమని స్పష్టం చేశారు. టిక్కెట్లు వచ్చేశాయని నిర్లక్ష్యం తగదన్న చంద్రబాబు తెలిపారు. వచ్చే 40 రోజులు అత్యంత…
కాకినాడ జిల్లాలోని జగ్గంపేట టికెట్టు టిడిపికి కేటాయించడంపై జనసేన పార్టీలో అసంతృప్తి నెలకొంది . టిక్కెట్ ఆశించి భంగపడిన. జనసేన జగ్గంపేట ఇన్ ఛార్జీ పాఠం శెట్టి సూర్యచంద్ర అంతిమ నిరాహార దీక్షకు దిగారు. తనకు జనసేన నాయకత్వం జగ్గంపేట అసెంబ్లీ స్థానానికి టికెట్ కేటాయించకపోవడంతో తీవ్ర అసంతృప్తితో గోకవరం మండలం అచ్చుతాపురం గ్రామంలో ఉన్న దుర్గమ్మ ఆలయానికి చేరుకుని అంతిమ దీక్ష ప్రారంభించారు. పాఠం శెట్టి దంపతులు ఆలయంలోనే ఉండి దీక్ష కొనసాగిస్తున్నారు. . ప్రజలకు…