కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో స్వర్ణాంధ్ర సాకార యాత్ర సభ నిర్వహించారు. ఈ సభలో హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ పాల్గొని ప్రసంగించారు. లెజెండ్ సినిమా 400 రోజులు ప్రదర్శించి దేశ చరిత్రలో ఎమ్మిగనూరు నిలిచిపోయిందని తెలిపారు. చరిత్ర సృష్టించాలన్నా, చరిత్ర తిరగరాయాలన్నా మనమేనని అన్నారు. ఎన్టీఆర్ నటనకు విశ్వరూపం అని చెప్పారు. మరోవైపు.. మహిళల్లో చంద్రబాబు ఆర్థిక విప్లవాన్ని తెచ్చారని పేర్కొన్నారు. రాయలసీమకు తాగునీరు, సాగునీరు ఇచ్చిన అభినవ భగీరథుడు అని కొనియాడారు.
అమరావతి: న్యాయం జరగడంలో ఆలస్యమవ్వొచ్చేమో గానీ న్యాయం మాత్రం గెలుస్తుందని మాజీ మంత్రి కేఎస్ జవహార్ అన్నారు. 1996లో జరిగిన శిరోముండనం కేసులో మండపేట వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తోట త్రిమూర్తులుకు 18 నెలలు జైలు శిక్ష పడటంపై ఆయన స్పందించారు. తోట త్రిమూర్తులను వైసీపీ నుంచి వెంటనే బహిష్కరించాలన్నారు. లేదంటే దళితుల అణచివేతకు జగన్ లైసెన్స్ ఇచ్చినట్లే అని విమర్శించారు.
శిరోముండనం కేసును భూతద్దంలో చూపించి రాజకీయ లబ్ధిపొందాలని చూసిన నా ప్రత్యర్థులకు, టీడీపీ నేతలకు ఇవాళ వచ్చిన తీర్పు రుచించదు అని పేర్కొన్నారు త్రిమూర్తులు.. నాకు సంబంధం లేని కేసును ఇంతకాలం ఎదుర్కొన్నాను... కోర్టు తీర్పును హైకోర్టులో అప్పీల్ చేస్తాను అన్నారు. హైకోర్టులో నాకు 100 శాతం న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాని తెలిపారు.
భవన నిర్మాణ కార్మికులుగా వివిధ పనులు చేస్తూ జీవనం సాగించే సగరులు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఎదగాలని గన్నవరం నియోజకవర్గ టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు ఆకాంక్షించారు.
గొర్విమానిపల్లి ప్రస్తుత ఎంపీటీసీ పులి ప్రకాష్ రెడ్డితో పాటు అతని సోదరుడు పులి సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో ముగ్గురు వార్డు మెంబెర్లు, కీలక నాయకులు, కార్యకర్తలు బనగానపల్లె నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి బీసీ జనార్దన్ రెడ్డి సమక్షంలో టీడీపీ కండువా కప్పుకున్నారు.
ఏపీలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. వైసీపీ నేతలు నియోజకవర్గాల వారీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నేడు శ్రీ సత్యసాయి జిల్లాలోని గాండ్లపెంట, కదిరి రూరల్, తనకల్లు మండలాల్లో ఇంఛార్జ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. మంచి చేశారు కాబట్టే తనకు ఓటు వేయాలని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అడుగుతున్నారన్నారు. చంద్రబాబు ఐదేళ్లు రాజధాని పేరుతో వృధా చేసి, లోపభూయిష్టంగా నాలుగు భవనాలు కట్టారని…