విభజన వల్ల ఏపీకి నష్టం జరిగిందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. గత ఐదేళ్ల పాలన వల్ల ఏపీ రాజధాని ఏంటో క్లారిటీ లేని పరిస్థితి వచ్చిందని తెలిపారు. బడ్జెట్ కూడా పెట్టుకోలేనంత ఆర్థిక ఇబ్బందుల్లో రాష్ట్రం ఉందని ఆరోపించారు. ఆర్థిక గందరగోళ పరుస్థితులు చక్కదిద్ది మరో రెండు నెలల తర్వాత బడ్జెట్ పెట్టుకునే పరిస్థితి ఉందని పేర్కొన్నారు. ఇబ్బందులను అధిగమించి ఏపీని నెంబర్-1 స్థానంలో నిలపాలని సీఎం చంద్రబాబు అన్నారు.
గ్రూపు 1 పరీక్ష అక్రమాల పై గత ప్రభుత్వ తీరును ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర తప్పు బట్టారు. గ్రూపు-1 పోస్టుల భర్తీ నియామక పరీక్షపై అసెంబ్లీలో ప్రశ్నించారు. ఏపీపీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణకు ధూళిపాళ్ల డిమాండ్ చేశారు. సభ్యుల సూచనల మేరకు సీబీఐ విచారణను పరిశీలిస్తామని మంత్రి పయ్యావుల కేశవ్ సమాధానమిచ్చారు.
ఏపీలో రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. రేపటి నుంచి 5 రోజుల పాటు ఈ సమావేశాలు జరగనున్నాయి. ఈ నెలాఖరుతో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్గడువు పూర్తి కానున్నందున మరో మూడు నెలలకు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.