ఏపీలో రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. రేపటి నుంచి 5 రోజుల పాటు ఈ సమావేశాలు జరగనున్నాయి. ఈ నెలాఖరుతో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్గడువు పూర్తి కానున్నందున మరో మూడు నెలలకు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.
Home Minister Anitha: తప్పుడు ప్రచారం చేస్తోన్న మాజీ సీఎం జగన్ మీద చర్యలు తీసుకుంటామని హోం మంత్రి వంగలపుడి అనిత తెలిపారు. ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక 36 రాజకీయ హత్యలు జరిగాయని జగన్ తప్పుడు ఆరోపణలు చేశారు.. 36 హత్యల వివరాలు జగన్ ఇవ్వగలరా..? అని ప్రశ్నించారు.
AP Assembly: ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీలో మరోసారి తెర పైకి ప్రతిపక్ష నేత హోదా రానుంది. తనకు ప్రతిపక్ష నేత హోదా కల్పించాలని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కోరుతున్నారు. 11 సీట్లే వచ్చాయి కాబట్టి.. ప్రతిపక్ష హోదా ఇవ్వలేమంటోన్న అధికార పక్షం.. ఇప్పటి వరకు జరగని అసెంబ్లీలో సీట్ల కేటాయింపు జరపని స్పీకర్..
రాష్ట్రాన్ని ఆర్థికంగా గట్టెక్కించాలంటే కేంద్రం సాయం అవసరమని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. ఎంపీలకు కొన్ని కొన్ని శాఖలు కేటాయించారని.. కేటాయించిన శాఖలకు సంబంధించి కేంద్రం నుంచి నిధులు తెచ్చే బాధ్యత ఎంపీలపై ఉందన్నారు. వివిధ స్కీంల వచ్చే కింద కేంద్ర నిధులను ఏపీకి రప్పించే ప్రయత్నం చేస్తామన్నారు.
Gudivada Amarnath: టీడీపీ- జనసేన- బీజేపీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగిన దాడులు, హత్యలపై ముందుగా శ్వేతపత్రం విడుదల చేయ్యాలని మాజీమంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు అవుతోంది.. ఏపీలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా విఫలం అయ్యింది..