AP Assembly Session: రేపట్నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి… రేపు ఉదయం 9 గంటలకు శాసన సభ… 10 గంటలకు మండలి సమావేశాలు ప్రారంభం అవుతాయి… సభ ఎన్ని రోజులు జరగాలి.. అనే అంశంపై బీఏసీలో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకోనున్నారు. ఉదయం 9 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానుండగా.. ఉదయం 10 గంటలకు మండలి సమావేశం ప్రారంభం అవుతుంది… అసెంబ్లీ వాయిదా పడిన తర్వాత బీఏసీ సమావేశం జరుగుతుంది…. అసెంబ్లీ సమావేశాలు నిర్మాణకు…
తెలుగుదేశం పార్టీ కంచుకోట తిరుపతి. ఇక్కడ ఎన్నికలు ఎప్పుడు జరిగినా... ఆ పార్టీదే పైచేయి అన్నట్టుగా ఉంటుంది. కానీ... గత ఎన్నికల్లో పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించడంతో కలిసి పనిచేసిన తమ్ముళ్లు భారీ మెజారిటీతో జనసేన అభ్యర్థి ఆరణి శ్రీనివాసులను గెలిపించుకున్నారు. ఇక అప్పటినుంచి టెంపుల్ సిటీ టీడీపీ సీన్ మారిందని అంటున్నారు తమ్ముళ్లు.
ఇక మనం వేగం పెంచాల్సిన సమయం ఆసన్నమైంది అంటూ మంత్రుల సమావేశంలో కీలక సూచనలు చేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. మంత్రులు మరింత సమర్థవంతంగా పనిచేయాలని ఆదేశించిన ఆయన.. ఐదేళ్ల వైసీపీ విధ్వంసం నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాం.. ఇక మనం వేగం పెంచాల్సిన సమయం ఆసన్నమైంది.. అందుకే కొత్త టీమ్ ను ఏర్పాటు చేసుకున్నాం అన్నారు..
Off The Record: ఐఏఎస్ అధికారి గిరిషా పేరు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మరోసారి మోగిపోతోంది. ముఖ్యంగా టీడీపీ సర్కిల్స్‌లో ఆయన గురించి తెగ మాట్లాడేసుకుంటున్నారు. దొంగ ఓటర్ కార్డుల కేసులో ఆయనకు క్లీన్చిట్ రావడమే అందుకు కారణం. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తిరుపతి లోక్‌సభ నియోజక వర్గ ఉప ఎన్నికలో దొంగ ఓటరు కార్డులు సృష్టించారన్న ఆరోపణలతో సస్పెండైన పీఎస్ గిరిషాకు తాజాగా ఉపశమనం లభించింది. ఇందులో ఆయన పాత్ర ఏం లేదని ప్రభుత్వానికి నివేదిక…
టీడీపీకి చెందిన చాలామంది ఎమ్మెల్యేల పనితీరుపై తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు సీఎం చంద్రబాబు. ఇప్పటికే వన్ టు వన్ మీటింగ్స్‌తో కొందరికి స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చారు. ఇక వీలున్నప్పుడల్లా నలుగురైదుగురు శాసనసభ్యులను పిలిచి క్లాస్ పీకుతున్నారు.
మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి పై హాట్ కామెంట్స్ చేశారు ఎమ్మెల్యే డాక్టర్ థామస్.. చిత్తూరు జిల్లా వెదరు కుప్పం మండలంలో 395 మహిళా సంఘాలకు 61 కోటి 95 లక్షల నిధుల చెక్కును పంపిణీ చేసిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే డాక్టర్ థామస్.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజా సంక్షేమం కోరే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అన్నారు.
పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో రాజకీయ చైతన్యం ఎక్కువే. ఇక్కడి నుంచి స్వాతంత్ర్య సమరయోధుడు వావిలాల గోపాలకృష్ణయ్య వరుసగా నాలుగుసార్లు గెలిచారు. ఇక 2014లో టీడీపీ నేత కోడెల శివప్రసాదరావు నర్సరావుపేట నుంచి సత్తెనపల్లికి వచ్చి పోటీ చేసి గెలిచారు. తర్వాత 2019లో ఇదే నియోజకవర్గం నుంచి ఓడిపోయారాయన. కోడెల అకాల మరణంతో సత్తెనపల్లి టీడీపీ ఇన్ఛార్జ్ పదవి ఖాళీ అయ్యింది. ఆ పోస్ట్ కోసం పోటీ కూడా ఓ రేంజ్లో నడిచింది.