మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌పై మంత్రి నిమ్మల రామానాయుడు ఫైర్ అయ్యారు. రాయలసీమ బిడ్డ అని చెప్పుకునే జగన్.. రాయలసీమ జీవనాడి అయిన హంద్రీనీవాకు ఒక్క రూపాయి ఖర్చుపెట్టలేదని విమర్శించారు. కనీసం మోటార్లకు బిల్లులు చెల్లించలేదని, తట్టమట్టి తీయలేదని మండిపడ్డారు. ఐదేళ్ళలో జగన్ చేయలేని పనిని, మొదటి ఏడాదిలోనే కూటమి ప్రభుత్వంలో పూర్తి చేసి చూపించాం అని మంత్రి చెప్పారు. కర్నూలులో ఇరిగేషన్ అధికారులతో మంత్రి నిమ్మల సమీక్ష నిర్వహించాడు. ఇరిగేషన్ అడ్వైజర్ వెంకటేశ్వరరావు,…
విశాఖపట్నంలోని కింగ్ జార్జ్ హాస్పిటల్ (కేజీహెచ్)లో చికిత్స పొందుతున్న హెపటైటిస్ ప్రభావిత విద్యార్థినులను గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్య రాణి ఈరోజు పరామర్శించారు. కేజీహెచ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆరుగురు పిల్లలతో మంత్రి మాట్లాడారు. వారి ఆరోగ్యంపై డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. చనిపోయిన పిల్లలకు నష్ట పరిహారంపై సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. పార్వతీపురం మన్యం జిల్లాలోని కురుపాం ఆశ్రమ పాఠశాలలోని విద్యార్థులు కొందరు హెపటైటిస్–ఏతో బాధపడుతున్న విషయం…
Dharmana Prasada Rao: ప్రజల ఆరోగ్యం రాజ్యాంగ హక్కు అని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు పేర్కొన్నారు. ప్రాథమిక బాధ్యతల నుంచి తప్పించుకుంటాం అంటే ఎలా?.. 17 మెడికల్ కాలేజీలు తీసుకు వచ్చాం.. కాలేజీతో పాటు హాస్పిటల్ అందుబాటులో ఉంది.. గవర్నమెంట్ చేయలేనిది ప్రైవేట్ వ్యక్తులు ఎందుకు చేస్తారు.. ప్రైవేట్ వ్యక్తులు దోచుకోవడానికే చూస్తారని తెలిపారు.
Off The Record: అతనికంటే ఘనుడు ఆచంట మల్లన్న అన్నది సామెత. ఇప్పుడు ఏపీ లిక్కర్ ఎపిసోడ్లో జరుగుతున్న పరిణామాల్ని చూస్తున్న వాళ్ళంతా… ఈ సామెతను గుర్తు చేసుకుంటున్నారట. ఎవరు దొంగలు, ఎవరు దొరలు…. అసలు ఎవరిది పాతివ్రత్యం అంటూ…పొలిటికల్ సర్కిల్స్‌తో పాటు సామాన్య జనంలో కూడా చర్చలు మొదలయ్యాయి. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు భారీ ఎత్తున మద్యం కుంభకోణం చేసిందని ఆరోపిస్తున్న కూటమి పార్టీలు… అధికారంలోకి వచ్చాక దర్యాప్తు కోసం సిట్ ఏర్పాటు చేశాయి. ఈ…
Jogi Ramesh: సిట్‌ను పక్కన పెట్టి.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీబీఐ దర్యాప్తు కోరాలి.. అప్పుడే నకిలీ మద్యం కేసులో ఆయనకు చిత్తశుద్ధి ఉందని నమ్ముతారు అని వ్యాఖ్యానించారు మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జోగి రమేష్.. నకిలీ మద్యం వ్యవహారం బయటపడటంతో చంద్రబాబు తప్పుడు కేసులు పెడుతున్నారని ఫైర్ అయ్యారు.. ఇది చంద్రబాబుకి వెన్నతో పెట్టిన విద్య.. కేసులో అసలు నిందితులను పట్టుకోవడం కోసం సిట్ వేశారని విమర్శించారు.. ఈ సిట్…
MLA Bojjala Sudheer Reddy: హత్యకు గురైన డ్రైవర్ రాయుడు పాత వీడియో ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారిపోయింది.. డ్రైవర్ రాయుడు వీడియోపై స్పందించిన జనసేన మాజీ నాయకురాలు వినుత కోటా.. రాయుడు చావులో మా ప్రమేయం లేదు.. కాబట్టే మాకు కోర్టులో బెయిల్ వచ్చిందన్నారు.. మేం ఫారిన్లో లక్షల జీతాలున్న ఉద్యోగాలు వదులుకొని రాజకీయాల్లోకి వచ్చింది ప్రజలకు సేవ చేయడానికి కానీ మనుషుల ప్రాణాలు తీయడానికి కాదన్నారు.. నాపై జరిగిన కుట్రకు సంబంధించిన…
Balakrishna : హీరో, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణకు మంత్రి పదవి ఇవ్వాలంటూ టీడీపీ కార్యకర్తలు డిమాండ్ చేశారు. హిందూపురంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఎమ్మెల్యే బాలకృష్ణ వెళ్లారు. హిందూపురం మండలం కిరీకేర పంచాయతీ బసవనపల్లి ZPHS లో 64 లక్షల రూపాయలతో నిర్మించిన స్కూల్ బిల్డింగ్ ను బాలకృష్ణ ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆయన తిరిగి వస్తున్న సందర్భంలో కిరీకేర పంచాయతీ బసవనపల్లి వద్ద ప్లకార్డ్స్ పట్టుకొని అభిమానులు రోడ్డుపై నినాదాలు…
CM Chandrababu: రాజధాని అమరావతిలోని సీఆర్డీయే కార్యాలయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. భూములు ఇచ్చిన రైతులతో కలిసి ఈ భవనాన్ని ఆరంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి రాజధాని లేని పరిస్థితి ఏర్పడింది.
శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గం పర్యటనలో భాగంగా నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మొదటి రోజు సమీక్షలు, సమావేశాలతో బిజీబిజీ ఉన్నారు. హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి పూర్వ వైభవం తీసుకొస్తా అని హామీ ఇచ్చారు. ప్రభుత్వాసుపత్రి అభివృద్ధిపై గత పాలకులు నిర్లక్ష్యం వహించారని మండిపడ్డారు. ఆస్పత్రిలో డాక్టర్లు, సిబ్బందిని అదనంగా ఏర్పాటు చేసి రోగులకు ఇబ్బందులేకుండా చూస్తా అని, ఆస్పత్రిలో ఉన్న పరికరాలతో పాటు మరిన్ని ఎక్విప్మెంట్ ఏర్పాటు చేస్తామని బాలయ్య బాబు చెప్పారు. Also…