టీడీపీ జాతీయ అధ్యక్షుడు సీఎం చంద్రబాబు సమక్షంలో టీడీపీ లో చేరారు ముగ్గురు ఎమ్మెల్సీలు. కళ్యాణ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ, మర్రి రాజశేఖర్ టీడీపీలో చేరారు. మా రాజీనామాలు ఇప్పటివరకు ఆమోదించలేదన్నారు. రాజీనామాల ఆమోదం కోసం ఆరు నెలలుగా వేచి చూశాం. రాజీనామా ఆమోదిస్తారన్న నమ్మకం లేదు. మండలి చైర్మన్ వెనుక ఉండి నడిపించేవారి వల్ల రాజీనామాలు ఆమోదించలేదని మర్రి రాజశేఖర్ తెలిపారు. Also Read:India: సౌదీ అరేబియా వీటిని దృష్టిలో ఉంచుకోవాలి.. పాక్‌తో రక్షణ ఒప్పందంపై…
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇస్తూ.. ఇప్పటికే ఆ పార్టీకి గుడ్‌బై చెప్పిన శాసనమండలి సభ్యులు మర్రి రాజశేఖర్.. ఇప్పుడు టీడీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు.. ఈరోజు ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో.. తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు మర్రి రాజశేఖర్.
మెడికల్ కాలేజీలవ్యవహారంపై ఆందోళనకు పిలుపునిచ్చింది వైసీపీ.. ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ అసెంబ్లీ వద్ద వైసీపీ ఎమ్మెల్సీలు ధర్నా చేశారు.. మండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ సహా వైసీపీ ఎమ్మెల్సీలు హాజరయ్యారు.. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా నూతన మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చలో మెడికల్ కాలేజీ కు పిలుపు ఇచ్చిన వైసీపీ విద్యార్థి, యువజన విభాగాలు.
Off The Record: సి.రామచంద్రయ్య…. సీనియర్ పొలిటీషియన్. ఒకప్పుడు వైసీపీలో కీలకంగా ఉన్నారు ఈ ఎమ్మెల్సీ. అయితే… గత ఎన్నికల సమయంలో ఆ పార్టీ మీదే నిప్పులు చెరిగి… మెల్లిగా టీడీపీకి దగ్గరయ్యారు. ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వైసీపీ తరపున వచ్చిన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు సీఆర్. కూటమి సర్కార్ కూడా వెంటనే ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చేసింది. తాను రాజీనామా చేసిన పదవికే నోటిఫికేషన్ రావడంతో… మరో ఆలోచన లేకుండా ఈ…
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అనంతపురం జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు టీడీపీ సీనియర్ నేత, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి.. అసలు, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి ఇచ్చిన సుప్రీంకోర్టు ఆర్డర్ లో ఏముందో ఒకసారి చూడాలని హితువు పలికారు.. అయితే, తాడిపత్రికి కేతిరెడ్డి పెద్దారెడ్డి వచ్చిన సమయంలో తాము ఏం అనలేదనే విషయాన్ని గుర్తుచేశారు జేసీ..
టీడీపీ నేతలకు బెల్ట్ షాపులు ఉపాధి హామీ పథకం కింద మారాయని వైసీపీ నేత, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు విమర్శించారు. బెల్టు షాపులు పెడితే బెండు తీస్తామని అసెంబ్లీ సాక్షిగా సీఎం చంద్రబాబు నాయుడు చెప్పారని ఆయన అన్నారు. ఇప్పటి వరకూ ఎంతమంది బెండు తీశారో సమాధానం చెప్పాలని ఆయన ప్రశ్నించారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. గురువారం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో టీడీపీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు వైసీపీ నేత, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు. బెల్టు…
Off The Record: విశాఖ ఉత్తరం నియోజకవర్గంలో టీడీపీ, వైసీపీ బలమైన రాజకీయ పక్షాలు. పునర్విభజన తర్వాత ఏర్పడిన ఈ స్థానంపై పట్టుసాధించేందుకు ప్రధాన పార్టీలు గట్టిగానే పోరాడుతుంటాయి. 2009లో తొలిసారి ఈ నియోజకవర్గానికి ఎన్నికలు జరగ్గా కాంగ్రెస్ పార్టీ గెలిచింది. 2014లో కూటమి అభ్యర్థిగా విష్ణుకుమార్ రాజు విజయం సాధించారు. ఇక 2019లో ఒంటరిగా పోటీ చేసిన టీడీపీ స్వల్ప మెజారిటీతో బయటపడింది. ఆ ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేగా బరిలోకి దిగిన విష్ణు నాలుగో స్థానంతో…