తన జీవితంలో ఇలాంటి ఘన విజయాన్ని చూడలేదని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. 93 శాతం స్టైక్ రేట్‌తో గెలవడం ఒక చరిత్ర అని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, తనపై ప్రజలు ఎంతో నమ్మకం పెట్టుకున్నారని.. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. రాష్ట్రంలో గాడి తప్పిన వ్యవస్థలను గాడిలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. దేశంలోనే తెలంగాణ నం.1గా ఉండటానికి కారణం టీడీపీ పార్టీనే అని సీఎం చంద్రబాబు…