ఏపీలో రాజకీయం మారిందన్నారు ఏపీ టీడీపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ విజయంపై ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో కొత్త ఎమ్మెల్సీలు ఘన విజయం సాధించారు.ఈ ఎన్నికల ఫలితాలతో రాజకీయ పరిస్థితి మార్చాం.డబ్బు, అధికారం, కులాల చిచ్చు.. ఇలాంటి వాటితో రాజకీయాలను భ్రష్టు పట్టించారు.ఇలాంటి పరిస్థితిని ఈ ఎన్నికల్లో మార్చిన ఘనత ఈ ముగ్గురు ఎమ్మెల్సీలదే.ఉత్తరాంధ్రలో వెండి నాణెలు పంచినా ఉత్తరాంధ్ర ప్రజలు విఙత ప్రదర్శించారు.
తూర్పు, పశ్చిమ రాయలసీమలో అధికార పార్టీ చాలా ప్రలోభాలకు గురి చేసింది.పులివెందుల నుంచే పశ్చిమ రాయలసీమ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా రాం గోపాల్ రెడ్డి నిలిచి.. గెలిచారు.ఈ ఎన్నికల ఫలితాలతో జగన్.. వైసీపీ ఎమ్మెల్యేల మైండ్ పని చేయడం లేదు. టీడీపీ గెలుపును జీర్ణించుకోలేక సభలో ఎస్సీ ఎమ్మెల్యే స్వామిపై దాడి చేశారు.
Read Also:MLC Chiranjeevi Rao: పట్టభద్రులంతా అసంతృప్తితో ఉన్నారు
గెలిచామని.. విశ్రాంతి తీసుకోవద్దు.ఈ ఓటమితో జగన్ కల్లు తాగిన కోతిలా మారాడు.భవిష్యత్తులో మరింత దాడులు జరిగే అవకాశం ఉంటుంది.వైసీపీని అన్ని రకాలుగా ఎదుర్కొవడానికి సిద్దంగా ఉండాలి.చిన్నపాటి లోపాలను సరిదిద్దుకోవాలి.ఇప్పటి వరకు అభ్యర్థుల ఖరారులో జాప్యం జరిగింది.ఈసారి చాలా త్వరగానే అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది.రెండో ప్రాధాన్యత ఓటు విషయంలో పీడీఎఫ్ తో పరస్పర సహకారం తీసుకునే నిర్ణయంలో చంద్రబాబు చాణక్యం చూపించారు. రెండో ప్రాధాన్యత ఓటు ఉంటుందని నాకూ తెలీదు. ఇలాంటి సందర్భాల్లోనే సీనియార్టీ అక్కరకి వస్తుంది.
Read Also: Shanmukh Jaswanth: అరేయ్.. ఏంట్రా ఇది.. దీప్తిని వదిలేసి కొత్త లవర్ తో ముద్దులు