చంద్రబాబు మాటలు ఆశ్చర్యం, నవ్వు వేస్తున్నాయన్నారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. సాధారణ ఎన్నికల్లో గెలిచినంత ఆత్రుత చంద్రబాబులో కనిపించింది.మూడు ఎమ్మెల్సీల్లో గెలిచి మా పై వ్యాఖ్యలు చేయటం ఆశ్చర్యంగా ఉంది. 2019లో మిమ్మల్ని ప్రజలు తుక్కు తుక్కుగా తొక్కారుగా. ఉప ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో అడ్రెస్ లేకుండా ఓడిపోయిన పరిస్థితి గురించి ఏం చెబుతారు? చంద్రబాబు వ్యాఖ్యలు పిట్టల దొర, కమెడియన్ మాట్లాడినట్లు ఉంది. నిజంగా చంద్రబాబుకు దుమ్ము ధైర్యం ఉంటే 175 స్థానాల్లో పోటీ చేయి. ఒక్క మాట అయినా అనగలవా?దత్త పుత్రుడు లేకుండా అడుగు బయటపెట్ట లేని పరిస్థితి ఎందుకు?
Read Also: Man Beating Woman: ఢిల్లీలో దారుణం.. యువతిని బలవంతంగా కారులో ఎక్కించి..
పశ్చిమ రాయలసీమ ఎన్నికల్లో అధికారులు వ్యవహరించిన తీరు అభ్యంతరకరంగా ఉంది. టీడీపీలోని పెద్ద పెద్ద నాయకులు ఏజెంట్లుగా వచ్చి కూర్చున్నారు. ఈ దబాయింపులకు ఎందుకు పార్టీ. అసలు మేం అధికారంలో ఉన్నామా అనే మాకే ఒక్కోసారి అనుమానం వస్తుంది. మేం ఆధారాలతో అవకతవకలు చూపించామా లేదా?? ప్రజాస్వామ్యబద్ధంగానే పోరాటం చేశాం. బుల్డోజ్ చేయటం మాకు చేతకాదు. అధికారులు మా అడుగులకు మడుగులు ఎత్తేటట్లు అయితే ఫలితాలు ఇలా ఉండవు.స్కిల్ డెవలప్మెంట్ స్కాం లాంటివి జరిగేవి.చంద్రబాబు అంబేద్కర్ చెప్పాం వ్యాఖ్యలు చూస్తే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంది.
Read Also: Man Beating Woman: ఢిల్లీలో దారుణం.. యువతిని బలవంతంగా కారులో ఎక్కించి..
ఎవరైనా దళితుడిగా పుట్టాలనుకుంటారా అన్న వ్యక్తి చంద్రబాబు. చంద్రబాబు గురించి చెప్పించుకునే పరిస్థితిలో వైసీపీ లేదు. చంద్రబాబు రిజెక్టెడ్ పొలిటీషియన్. ఈ జీవితంలో శాసనసభ లో అడుగు పెట్టే అవకాశాన్ని కోల్పోయాడన్నారు సజ్జల. పశ్చిమ రాయలసీమ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్ల అవకతవకల పై సహేతుకమైన ఆధారాలు చూపించాం. రిటర్నింగ్ అధికారి అలా ఎందుకు నిర్ణయం తీసుకున్నారో మాకు తెలియదు. కోర్టులో సవాలు చేసే అవకాశాలను కూడా పరిశీలిస్తున్నాం అన్నారు సజ్జల.