టీడీపీ-జనసేన పార్టీల తరఫున శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితా విడుదల కానున్న నేపథ్యంలో సీనియర్ నేతలతో చంద్రబాబు భేటీ అయ్యారు. ఉండవల్లిలోని ఆయన నివాసంలో సీనియర్ నేతలైన అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు, యనమల రామకృష్ణుడు, నక్కా ఆనంద్‌బాబు, గొట్టిపాటి రవి, అనగాని సత్యప్రసాద్‌తో సమావేశమయ్యారు.
ఏపీలో టీడీపీ సీనియర్ల కామెంట్స్ పార్టీలో కలకలం రేపుతున్నాయా? వారి వ్యాఖ్యలు చర్చగా మారుతున్నాయా? రచ్చరచ్చ అవుతోందా? నేతల స్టేట్‌మెంట్స్ తెలుగుదేశాన్ని మరోసారి గందరగోళంలో పడేస్తున్నాయా? సీనియర్ల ప్రకటనల వెనక ఉన్న మర్మం ఏంటి? టీడీపీలో సీనియర్లు ఎందుకు తిరగబడుతున్నారు? ఏపీలో అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత టీడీపీ నుంచి గోడ దూకేయాలని అనుకున్నవారు దూకేశారు. పార్టీనే అంటిపెట్టుకుని ఉన్నవారు సైలెంట్ అయ్యారు. ఒకరో ఇద్దరో మాట్లాడినా.. కేసులకు భయపడి దూకుడు తగ్గించేశారు. చూస్తుండగానే రెండున్నరేళ్లు గడిచిపోయింది.…