Chandrababu: టీడీపీ-జనసేన తొలి జాబితాపై సీనియర్ నేతలతో చంద్రబాబు భేటీ.. సర్వత్రా ఉత్కంఠ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chandrababu: టీడీపీ-జనసేన పార్టీల తరఫున శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితా విడుదల కానున్న నేపథ్యంలో సీనియర్ నేతలతో చంద్రబాబు భేటీ అయ్యారు. ఉండవల్లిలోని ఆయన నివాసంలో సీనియర్ నేతలైన అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు, యనమల రామకృష్ణుడు, నక్కా ఆనంద్‌బాబు, గొట్టిపాటి రవి, అనగాని సత్యప్రసాద్‌తో సమావేశమయ్యారు. టీడీపీ -జనసేన కూటమి అభ్యర్థుల పేర్లను ప్రకటించనున్న నేపథ్యంలో ఇరు పార్టీల నేతల్లో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. జాబితాలో ఎవరెవరి పేర్లు ఉంటాయనే అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఒకే వేదికపై నుంచి అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించనున్నట్లు పార్టీ వర్గాల సమాచారం.
Read Also: TTD EO Dharmareddy: తిరుపతి అభివృద్ధికి టీటీడీ సంపూర్ణ సహకారం
Also Read
ఉదయం 11 గంటల తర్వాత అభ్యర్థుల తొలి జాబితాను చంద్రబాబు – పవన్ విడుదల చేయనున్నారు. 60-70 స్థానాల్లో అభ్యర్థుల పేర్లను చంద్రబాబు – పవన్ ప్రకటించనున్నారు. 50కి పైగా టీడీపీ, 10కి పైగా జనసేన స్థానాల్లో అభ్యర్థులను టీడీపీ – జనసేనలు ప్రకటించనున్నాయి. ముఖ్య నేతలతో టీడీపీ అధినేత చంద్రబాబు భేటీ కానున్నారు. ఉదయం తొమ్మిది గంటలకల్లా అందుబాటులో ఉండాలని పలువురి నేతలకు చంద్రబాబు సూచించారు. నాదెండ్ల సహా ఇతర ముఖ్య నేతలతో పవన్ భేటీ కానున్నారు. బీజేపీతో సీట్ల సర్దుబాటుపై క్లారిటీ వచ్చాక రెండో విడత అభ్యర్థుల జాబితాను కూటమి పార్టీలు ప్రకటించనున్నాయి. ప్రస్తుతం అసెంబ్లీ సీట్లల్లో అభ్యర్థుల ప్రకటనకే టీడీపీ – జనసేన పరిమితం కానుంది. బీజేపీతో పొత్తు క్లారిటీ వచ్చాక ఎంపీ సీట్లపై క్లారిటీ వచ్చే అవకాశముందని కూటమి పార్టీల వర్గాలు పేర్కొంటున్నాయి. మరోవైపు బీజేపీతో పొత్తుపై చర్చలు కొనసాగుతున్న నేపథ్యంలో పూర్తి జాబితా సిద్ధం కాలేదని తెలుస్తోంది. తొలి జాబితాతో పార్టీ నాయకుల్లో జోష్ నింపేందుకు నిర్ణయించినట్లు సమాచారం. ఫిబ్రవరి 28న తాడేపల్లిగూడెంలో ఇరు పార్టీలు ఉమ్మడిగా బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే.
తాజావార్తలు
-
Afghanistan: ఆఫ్ఘాన్‌లో అమ్మాయిగా పుట్టడమే శాపమా?
-
Russia Sanctions Bill: రష్యా నుంచి చమురు కొంటే భారత్‌పై 100% టారిఫ్‌లు? అమెరికా హౌస్‌లో కీలక బిల్లు పాస్
-
Hyderabad Liberation Day : హైదరాబాద్ విమోచన దినోత్సవం.. సెప్టెంబర్ 17 చరిత్ర ఇదే!
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!