Andhra Pradesh CM Jagan Fired on TDP MLA’s at Assembly Meetings Today. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో సంభవించిన మరణాలపై చర్చించాలంటూ టీడీపీ ఎమ్మెల్యే పట్టుబట్టారు. దీంతో అసెంబ్లీ సమావేశాల్లో కొద్దిసేపు స్పీకర్ రద్దు చేశారు. అనంతరం ప్రారంభమైన అసెంబ్లీ సమావేశంలో సీఎం జగన్ మాట్లాడుతూ.. సహజ మరణాలకు కూడా టీడీపీ వక్రీకరిస్తోందని ఆయన విమర్శించారు. అంతేకాకుండా చంద్రబాబు…
ఆ మాజీ మంత్రికి ఎప్పటి లెక్క అప్పుడేనా? ఏ రోటికాడ ఆ పాట పాడతారా? ఇప్పుడు ఉనికి ప్రమాదంలో పడిందని కులం కార్డు ప్రయోగిస్తున్నారా? ఈ మార్పు వెనక రాజకీయ వ్యూహం ఉందా? నాలుగుసార్లు ఎమ్మెల్యే. ఒకసారి ఎంపీ. గతంలో కిరణ్‌కుమార్‌రెడ్డి, చంద్రబాబు కేబినెట్‌లో మంత్రి. ఇవీ గంటా శ్రీనివాసరావు పొలిటికల్ బయోగ్రఫీలో కీలక అంశాలు. 2019లో ఎమ్మెల్యేగా గెలిచినా.. తాను ఉన్న టీడీపీ అధికారానికి దూరంగా కావడంతో సైలెంట్ అయ్యారు. మధ్యలో గంటా వైసీపీలోకి వెళ్తున్నారని…
టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కార్యవర్గ ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు. అచ్చెన్నాయుడు, పార్టీ నేతలు పాల్గొన్నారు. అక్కడ అచ్చెన్నాయుడు మాట్లాడుతూ… ఒక్క అవకాశం అంటూ దరిద్రాన్ని తెచ్చుకున్నారు. పాఠశాలల్లో నాడు నేడు పేరుతో వేల కోట్ల అవినీతి జరుగుతుంది. పాఠశాలల్లో రూ. 10 పనికి రూ. 100 కొట్టేశారు. పేదలకు పట్టాల పేరుతో ఓటిఎస్ అంటూ రూ. 5 వేల కోట్లు వసూలు చేసేందుకు సిద్దమయ్యారు. విదేశీ విద్యాదీవన పథకాన్ని మధ్యలో నిలిపి వేస్తారా.. విదేశాల్లో…
ఓటీఎస్ పేరుతో పేద ప్రజలను ప్రభుత్వం ఇబ్బంది పెడుతుంది అని టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. గత ప్రభుత్వాలు పేదలకు ఇళ్లు, ఇళ్ల స్థలాలు ఇచ్చాయి. రూ. 6 వేల కోట్ల దోపిడీ లక్ష్యంగా ఓటీఎస్ అమలుకు ప్రయత్నం చేస్తుంది. డ్వాక్రా గ్రూపుల నుంచి మహిళ పొదుపు సొమ్ము కూడా బలవంతంగా ప్రభుత్వం లాక్కుంటుంది.జగనన్న కాలనీలను అభివృద్ధి చెయ్యడం చేతకాని ప్రభుత్వం .. పేదలను ఓటీఎస్ పేరుతో పీడిస్తుంది. ఆంధ్రప్రదేశును అమ్మకానికి పెట్టారు..…
ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాంకు లేఖ రాసారు టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్. ఈ నెల 19వ తేదీన జరిగిన సభలో జరిగిన ప్రొసీడింగ్సును ఎలాంటి ఎడిటింగ్ లేకుండా ఇవ్వాలని లేఖలో కోరారు అనగాని. ఈనెల 19వ తేదీన శాసనసభలో జరిగిన చర్చను ఎటువంటి ఎడిటింగ్ లేకుండా ఆడియో, వీడియోలను ప్రజల ముందు పెట్టాలి. గత రెండున్నరేళ్లుగా వ్యక్తిగత దూషణలు, విమర్శలు చోటు చేసుకోవడం అత్యంత బాధాకరం. స్త్రీ, పురుషులనే బేధం లేకుండా సభకు పరిచయం లేని…
ఏపీ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని బీజేపీ, టీడీపీ నానా యాగీ చేస్తున్నాయి. రూ. 50 ఉన్న పెట్రోల్, డీజిల్ ధరలను విపరీతంగా పెరిగేలా చేసింది బీజేపీ అని టీడీపీ రెబెల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అన్నారు. తన హయాంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయనే విషయాన్ని అల్జీమర్స్ సోకిన చంద్రబాబు మరిచారు. ధర్నాలు పేరుతో చంద్రబాబు కొత్త డ్రామాలాడుతున్నారు. పెట్రోల్, డీజిల్ ధరల విషయంలో వాస్తవాలు దాచి ధర్నాలు చేస్తున్నాయి ప్రతిపక్ష పార్టీలు. చంద్రబాబుకు…
కొమ్మారెడ్డి పట్టాభి విడుదలపై టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి స్పందించారు. ఇక్కడ న్యాయ వ్యవస్థ కూడా లేకపోతే జగన్ నియంతలా మారేవారు అని కామెంట్స్ చేసేవారు. కోర్టులు లేకపోతే జగన్ లో ఒక హిట్లర్ ని చూసేవాళ్లం అని తెలిపారు. ఇక వైసీపీ వారే గతంలో మమ్మల్ని అమ్మ బూతులు తిట్టింది. అధికారపార్టీ ధర్నాలు చేసే దౌర్భాగ్య పరిస్థితి రాష్ట్రంలో వచ్చింది అని తెలిపారు. ప్రశుతం ఈ ప్రభుత్వం ఫ్రస్ట్రేషన్ లో ఉంది అని బుచ్చయ్య…
బోషడీకే అనే పదానికి సీఎం తనకు కావాల్సిన అర్ధం వెతుక్కుంటున్నారు. బోష్ డీకే అని గుజరాత్ లోని ఓ గ్రామం ఉంది. ఆ పదానికి అమాయకులు అనే అర్ధం కూడా ఉంది అని టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల అన్నారు. ఏపీలో గంజాయి సాగు.. సరఫరా జరుగుతోందంటూ పక్క రాష్ట్రం డీజీపీనే అంటున్నారు. పక్క రాష్ట్రం సీఎం గంజాయి విషయంలో తీసుకుంటున్న చర్యలు ఏపీ సీఎం తీసుకుంటే మేమూ హర్షిస్తాం. టీడీపీ కార్యాలయంపై దాడిలో సుమారు పది మంది…
ముగ్గురు ఎమ్మెల్యేలు..30 మంది కార్పొరేటర్ల బలం ఉంది. సమర్ధత ఉన్నా.. అధికారపార్టీని ఢీకొట్టడానికి సాహసించే పరిస్థితి లేదు. అనుబంధ సంఘాల పోరాటాలే తప్ప ముఖ్య నాయకులు గప్‌చుప్. కష్టకాలంలో పార్టీని నడిపించాల్సిన ఆ ఎమ్మెల్యేలు సైలెంట్ అయ్యారా? సైడ్ అయ్యారా? ఎవరు వాళ్లు? విశాఖ టీడీపీ ప్రజాప్రతినిధుల్లో నైరాశ్యం..! ఉత్తరాంధ్రలో గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీకి కోలుకోలేని దెబ్బతగిలింది. హేమాహేమీలకే ఓటమి తప్పలేదు. ఇటువంటి పరిస్ధితుల్లోనూ టీడీపీకి గౌరవం కట్టబెట్టారు విశాఖ ఓటర్లు. హోరాహోరీ పోరులో నాలుగుచోట్ల…
టీడీపీ ఎమ్మెల్యేలు అచ్చెన్న, నిమ్మలపై చర్యలకు రంగం సిద్దం చేసారు. సభను తప్పు దోవ పట్టించారన్న శ్రీకాంత్ రెడ్డి ఫిర్యాదుపై అచ్చెన్న, నిమ్మలపై చర్యలకు సభకు సిఫార్సు చేయనుంది ప్రివిలేజ్ కమిటీ. మద్యం షాపుల విషయంలో అచ్చెన్న, వృద్ధాప్య పెన్షన్ల విషయంలో నిమ్మల సభను తప్పు దోవ పట్టించారని నిర్ధారించింది ప్రివిలేజ్ కమిటీ. స్పీకరును దూషించారనే ఫిర్యాదులో అచ్చెన్నాయుడు క్షమాపణలను పరిగణనలోకి తీసుకుని ప్రివిలేజ్ కమిటీ క్షమించింది అన్నారు. ఇక ప్రివిలేజ్ కమిటీ ఛైర్మన్ కాకాని గోవర్దన్…