తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ కీలక పోస్ట్ చేశారు. పదవి శాశ్వతం కాదు, బాధితులకు న్యాయం చేయలేనప్పుడు రాజకీయాల్లోకి రావడం అనవసరం అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వైసీపీ నేత భవనం నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్నారని కూల్చటానికి ఎమ్మెల్యే కొలికపూడి నిన్న జేసీబీతో వెళ్లారు. ఈ ఘటనపై కొలికపూడి సహా టీడీపీ నేతలు, క్యాడర్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా.. ఈ ఘటనపై సీఎం చంద్రబాబును కలిసి వివరణ ఇచ్చారు. అయితే..…
కన్నుల పండుగగా.. పింఛన్ పంపిణీ కార్యక్రమం జరుగుతోందని టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ అన్నారు. స్వయంగా పింఛన్ దారుల వద్దకు వెళ్లిన మొద్దమొదటి సీఎం చంద్రబాబు అని పేర్కొన్నారు.
గత ఎన్నికల్లో టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన గంటా శ్రీనివాసరావు.. పెద్దగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నది లేదు. టీడీపీతో అంటీముట్టనట్టుగానే ఉంటున్నారు. ఇప్పుడు ఎన్నికలకు రెండేళ్ల సమయం ఉందనగా యాక్టివ్ పాలిటిక్స్ ప్రారంభించారు ఈ మాజీ మంత్రి. కానీ.. ఆయన వేస్తున్న అడుగులకు.. క్రియాశీలకంగా మారేందుకు చేస్తున్న ప్రయత్నాలకు టీడీపీలోని ప్రత్యర్థులు చెక్ పెడుతున్నారు. దీంతో గంటా ప్రతీ కదలిక ఆసక్తిగా మారుతోంది. ఇలాంటి తరుణంలో చంద్రబాబు ఉత్తరాంధ్ర నుంచి బాదుడే.. బాదుడు నిరసన టూర్ చేపట్టారు. విశాఖ…
ప్రకాశం జిల్లా ఒంగోలు రిమ్స్ ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత నెలకొంది. రేపల్లెలో అత్యాచారానికి గురైన బాధితురాలిని పరామర్శించేందుకు బంధువులు రాగా.. పోలీసులు లోపలికి అనుమతించలేదు. దీంతో బంధువులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. తక్షణమే బాధితురాలిని చూపించాలని నిరసన చేపట్టారు. అయితే బాధితురాలి బంధువులతో కలిసి కొండేపి టీడీపీ ఎమ్మెల్యే బాల వీరాంజనేయస్వామి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ సందర్భంగా బాధితురాలి బంధువులు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ఈ ఘటనలో ఎమ్మెల్యే వీరాంజనేయస్వామి కాలికి గాయమైంది. అనంతరం…
రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలు, కరెంట్ కోతలకు నిరసనగా టీడీపీ నిరసనలు ఉధృతంగా సాగుతున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పట్టణం, నియోజకవర్గంలోని వివిధ మండలాలలో పలు గ్రామాల్లో టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు బాదుడే బాదుడు పేరుతో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. జగన్ ప్రభుత్వంలో పన్నులు నిత్యావసర ధరల పెంపుపై టీడీపీ విన్యూత్నరీతిలో నిరసనలు చేపట్టింది. పాలకొల్లు నియోజకవర్గంలో పెంచిన పన్నులు, నిత్యావసర ధరల పెంపుపై ఈ ప్రభుత్వం బాదుడే బాదుడును ఇంటింటికీ కార్యక్రమం…