బోషడీకే అనే పదానికి సీఎం తనకు కావాల్సిన అర్ధం వెతుక్కుంటున్నారు. బోష్ డీకే అని గుజరాత్ లోని ఓ గ్రామం ఉంది. ఆ పదానికి అమాయకులు అనే అర్ధం కూడా ఉంది అని టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల అన్నారు. ఏపీలో గంజాయి సాగు.. సరఫరా జరుగుతోందంటూ పక్క రాష్ట్రం డీజీపీనే అంటున్నారు. పక్క రాష్ట్రం సీఎం గంజాయి విషయంలో తీసుకుంటున్న చర్యలు ఏపీ సీఎం తీసుకుంటే మేమూ హర్షిస్తాం. టీడీపీ కార్యాలయంపై దాడిలో సుమారు పది మంది పోలీసులు దాడికి పాల్పడ్డారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దాడుల్లో పోలీసులు పాల్గొన్నారని వారే చెబుతున్నారు. డీజీపీ కార్యాలయంలో పీఆర్వోను స్పాటర్ అని చెబితే మేం నమ్మాలా అని ప్రశ్నించారు. ఈ కేసుకు సంబంధించిన అంశాన్ని నిగ్గు తేల్చేందుకు సీబీఐ ఎంక్వైరీని కోరతాం. తాడేపల్లి నుంచి విజయవాడ కన్వెన్షన్ సెంటర్ వరకూ ఉన్న సెల్ ఫోన్ టవర్ డేటా డంప్ ను విశ్లేషించాలి.
ఇక పార్టీ కార్యాలయం మీద దాడి ఘటనపై కోర్టుకూ వెళ్తాం. తప్పుడు కేసులు పెడితే మేం భయపడం. బాస్ ఆఫ్ ద పోలీస్ నుంచే తప్పులు జరుగుతున్నాయని పోలీసులే బాధపడుతున్నారు. క్షేత్ర స్థాయిలో ఉన్న పోలీసులు అంతర్మధనం చెందుతున్నారు. తమ బాస్ ఇచ్చే తప్పుడు ఆదేశాలు అమలు చేయలేక పోలీసులు నానా ఇబ్బందులు పడుతున్నారు. తాడేపల్లి రేప్ ఘటనలో నిందితులు గంజాయి వినియోగదారులే. ప్రభుత్వం తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలంటే సీబీఐ విచారణకు ఆదేశించాలి. సీఎం వేదిక మీద మాట్లాడిన పదాలే మంత్రులు గతంలో రైతులను ఉద్జేశించి వాడారు.. అప్పుడు సీఎంకు నొప్పి అనిపించలేదా.. రైతుల తల్లులు.. తల్లులు కాదా అని అడిగారు. మా పోరాటం డ్రగ్స్ మీద.. చేతనైతే మీరూ మా పోరాటంలో పాల్గొనండి. భారత ప్రధాని హోదాలో ఇందిరా గాంధీ వల్ల కూడా సాధ్యం కాని పనిని వైసీపీ చేయగలదా అని పేర్కొన్నారు.