Pawan Kalyan: ఎమ్మెల్యేగా సంపూర్ణ జీతం తీసుకుంటా.. ఎందుకంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pawan Kalyan: ఎమ్మెల్యేగా నేను సంపూర్ణ జీతమే తీసుకుంటాను అని ప్రకటించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన ఎమ్మెల్యేలు, ఎంపీలతో ఆత్మీయ సమావేశం నిర్వహించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నేను ప్రజల సొమ్మును తింటున్నాననే బాధ్యతను అనుక్షణం గుర్తుంచుకోవాలనే జీతం తీసుకుంటున్నాను అన్నారు. నేను సరిగా పని చేయకుంటే.. ప్రతి రూపాయికి నన్ను చొక్కా పట్టుకుని నిలదీసే హక్కు ప్రజలకు ఉండాలి.. అందుకే జీతం తీసుకుంటున్నాను.. తర్వాత నేను తిరిగి ఇచ్చేది ఇచ్చేస్తాను.. వేయింతలు ఇచ్చేస్తాను.. అది వేరే విషయం అన్నారు పవన్..
ఇక, చట్టాలను చేసేవాళ్లు ఎలా ఉండాలో చూపిద్దాం.. పార్లమెంటుకు వెళ్లేది పరిచయాల కోసం.. ప్రజల కోసం పని చేయడానికి అని గుర్తుంచుకోవాలని సూచించారు పవన్.. పోటీ చేయని నేతలు కూడా అసెంబ్లీకి వెళ్తున్నట్టే. రక్తం ధారపోసిన జనసైనికులు.. గడప దాటని వీర మహిళలు పార్టీని గెలిపించారు. కేంద్ర ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉండేటువంటి విజయం సాధించాం. ఇల్లు అలకగానే పండుగ కాదు.. పండుగ చేసుకునే సమయం కాదన్నారు. ఇది బాధ్యతతో ఉండాల్సిన సమయం. విజయంతో వచ్చే అతిశయం నాకు లేదు.. పార్టీలో ఎవ్వరూ పెట్టుకోవద్దు అని హెచ్చరించారు. కేంద్రంలో కీలక భాగం కాబోతున్నాం.. ఎంపీలు ఉదయ్, బాలశౌరీకి చాలా బాధ్యత ఉంది. ఢిల్లీలో జనసేన ఎంపీల కదలిక.. కామెంట్లను ప్రతి ఒక్కరూ పరిశీలిస్తారు. ఏపీ ప్రజల తరపున లోక్ సభలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు.. జాగ్రత్తగా ఉండాలని సూచించారు పవన్ కల్యాణ్..
Also Read
- SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
- Chairman's Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
- Vaibhav Sooryavanshi: అలా అయితే వైభవ్కు చోటు కష్టమే..? మాజీ క్రికెటర్ ఆసక్తికర విశ్లేషణ
- Off The Record: తూర్పు గోదావరిలో కూటమికి తిప్పలు... సీట్లు దక్కేదెవరికి...?
ఇది అద్భుతమైన విజయం.. పోటీ చేసిన స్థానాలన్నింటినీ గెలుచుకోవడమనేది దాదాపు అసాధ్యం అన్నారు జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు.. ఈసారి ఎన్నికలను నడిపింది.. పవన్ తర్వాత సామాన్య జనసైనికులే అన్నారు.. మరోవైపు.. 100 శాతం స్ట్రైక్ రేట్ ఉండాలని పవన్ అన్నారు.. అదే జరిగిందన్నారు జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్.. పోటీ చేసిన ప్రతి సీటు గెలవాలన్న పవన్ మాటల విలువేంటో ఇవాళ అందరికీ అర్థమైందన్నారు. ఇప్పుడు బాధ్యతగా ఎలా పని చేశామో.. అంతకు మించిన స్థాయిలో ఇక నుంచి కూడా పార్టీ కోసం పని చేయాలని సూచించారు నాదెండ్ల మనోహర్.
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?