చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ రేపు ( అక్టోబర్ 2 ) నారా భువనేశ్వరి నిరహార దీక్షకు దిగుతున్నారు. ఇక, అదే రోజు జైల్లోనే చంద్రబాబు సైతం నిరాహార దీక్ష చేయనున్నట్లు టీడీపీ నేతలు పేర్కొన్నారు.
అంగళ్ళులో తనపైన హత్యాయత్నం జరిగిందని చంద్రబాబు ఆరోపణ చేస్తున్నారని, సీబీఐ విచారణకు సిద్ధం అంటున్నారని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి ఆదిమూలపు సురేష్ విరుచుకుపడ్డారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు వెలిగొండ ప్రాజెక్టు గురించి పట్టించుకోని చంద్రబాబు ఇప్పుడు నంగనాచి కబుర్లు చెబుతున్నారని మండిపడ్డారు.
మూడు పర్యాయాలు ముఖ్యమంత్రిగా చేసిన ఏ ఒక్క ప్రాజెక్టును కూడా పట్టించుకోలేదని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు విమర్శలు గుప్పించారు. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పుడే ప్రాజెక్టు పనులు ముందుకు సాగాయన్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో జరిగిన వాలంటీర్లకు వందన కార్యక్రమంలో రోజా పాల్గొని ప్రసంగించారు. పేదలకు ఇచ్చే సెంటు స్థలాన్ని చంద్రబాబు సమాధులతో పోల్చడాన్ని ఆమె తప్పుబట్టారు.
నెల్లూరు జిల్లాలోని కందుకూరులో జరిగిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సభలో చోటు చేసుకున్న తొక్కిసలాటలో 8 మంది మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఘటన మరిచిపోకముందే తాజాగా అదే చంద్రబాబు సభలో మరోసారి తొక్కిసలాట జరిగింది.
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రికి హైదరాబాద్ జూబ్లిహిల్స్ లో ఇల్లు వుంది. అలాగే ఇప్పుడు కుప్పంలోనూ మరో ఇల్లు నిర్మించేందుకు అంతా సిద్ధం అయింది. కుప్పంలో ఇంటి నిర్మాణం కోసం ఇంతకుముందే భూమిని కొనుగోలు చేశారు చంద్రబాబు. ఇవాళ భూమికి సంబంధించి రిజిస్ట్రేషన్ పూర్తయింది. శాంతిపురం మండలం శివపురం వద్ద జాతీయ రహదారికి ఆనుకుని 1.99 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు చంద్రబాబు. చంద్రబాబుతో పాటు ఆయన పీఏ మనోహర్ పేర్లమీద భూమి రిజిస్ట్రేషన్ చేశారు అధికారులు.…
జగన్ సర్కార్ 3 ఏళ్ల రివర్స్ పాలనతో రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కి పోయిందని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శలు గుప్పించారు. బిల్లుల కోసం కాంట్రాక్టర్ కోర్టుకు వెళ్లకూడదు అని టెండర్‌లో నిబంధన పెట్టడం సిగ్గుచేటని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వ చర్య రాష్ట్ర పరువు తీసేలా ఉంది.. దీనికి సీఎం జగన్ సిగ్గుపడాలి అంటూ ఆయన ధ్వజమెత్తారు. కాంట్రాక్టర్లను బిల్లుల కోసం కోర్టుకు వెళ్లవద్దని టెండర్ డాక్యుమెంట్ లోనే నిబంధన పెట్టడం రాష్ట్ర దుస్థితికి, అసమర్థ పాలనకు…