పెన్షన్లు పేరుతో జగన్ రాజకీయం చేస్తున్నారు అని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆరోపించారు. వైసీపీ కార్యకర్తలు వృద్ధులను ఎండలో నిలబెట్టారు.. ఇక, వాలంటీర్ల వ్యవస్థే లేదంట అనే వార్త బయటకు వచ్చింది.. వాలంటీర్ల వ్యవస్ఖను రద్దు చేస్తూ రహస్య జీవో ఏమైనా తెచ్చారా..? అని ప్రశ్నించారు.
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలి అంటూ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు హెచ్చరించారు. చంద్రబాబు రాజకీయ వికలాంగుడంటూ చేసిన వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలి అని డిమాండ్ చేశారు.
బీసీల్లో ఎంత మందికి ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ పదవులు ఇవ్వగలమో అంతమందికి ఇస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు ఆధ్వర్యంలో ‘జయహో బీసీ’ వర్క్ షాప్ జరిగింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు ప్రసంగించారు.
టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఫైబర్ నెట్ కేసుపై రేపు ( గురువారం ) సుప్రీం కోర్టులో విచారణ జరుగనుంది. ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ కోసం చంద్రబాబు సుప్రీం కోర్టుకు వెళ్లారు. రేపేు కోర్ట్ నెంబర్ 6లో 11 వ నెంబర్‌గా చంద్రబాబు కేసు లిస్ట్ లో ఉంది.
టీడీపీ నాయకులు మరో కొత్త డ్రామాకు తెర లేపారని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. చంద్రబాబు ఆరోగ్యం విషమించిందని, ప్రాణాలకు ప్రమాదం ఉందని ప్రచారం మొదలు పెట్టారని ఆయన అన్నారు.
రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. చంద్రబాబు చర్మ సంబంధిత అస్వస్థతపై సెంట్రల్ జైలు అధికారులు ప్రకటన విడుదల చేశారు.