సమావేశానికి గైర్హాజరై 15మంది ఎమ్మెల్యేలు విదేశాల్లో ఉండటంపై సీఎం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజవర్గాల్లో ప్రజలకు దూరంగా ఉoడటo సరికాదని ముగింపు సందేశంలో గట్టిగా క్లాస్ పీకారు. ఆహ్వానితుల్లో 56మంది గైర్హాజరయ్యారంటూ సీఎం అసహనం వ్యక్తం చేశారు. ఉదయం ఎంత మంది వచ్చారు, సంతకాలు పెట్టి ఎంత మంది వెళ్లిపోయారు,
మంచి నాయకులకే ప్రజల్లో గుర్తింపు, గౌరవం ఉంటుందని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, జిల్లా పార్టీ అధ్యక్షులతో సుపరిపాలనలో తొలి అడుగు – ఇంటింటి టీడీపీ కార్యక్రమంపై ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మంత్రి నారాలోకేష్‌ను సీఎం కొనియాడారు.
సీనియర్లు పార్టీకి కాపలా కాశారని.. సీనియర్ల సహకారం పార్టీకి అవసరమని మంత్రి నారాలోకేష్ అన్నారు. తెలుగుదేశం పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో మంత్రి లోకేశ్ ప్రసంగించారు. ఎన్నికల్లో గెలుపు వెనుక కార్యకర్తల కష్టం ఉందని గుర్తు చేశారు. ప్రజల్లో ఉంటూ వారి సమస్యలు తెలుసుకుని పరిష్కరించేందుకు కష్టపడాలన్నారు. మంచి పనులు చేయాల్సిన బాధ్యత మనపై ఉందని స్పష్టం చేశారు. 151 సీట్లు 11 అయ్యాయంటే దానికి కారణం వారి అహంకారమని విమర్శించారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా…