ఏపీలో ఎన్డీయే కూటమి విడుదల చేసిన మేనిఫెస్టోపై మాజీ మంత్రి పేర్ని నాని సైటైర్లు వేశారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఇచ్చే హామీలు అమలు సాధ్యం కాదని బీజేపీ అర్థమైపోయిందని ఆయన అన్నారు. అరచేతిలో వైకుంఠం చూపించారని విమర్శించారు.
అస్పష్టమైన హామీలతో ప్రజల్ని మభ్యపెడుతున్న బీజేపీ, టీడీపీ, జనసేన మేనిఫెస్టోలో అభివృద్ధి జాడ ఎక్కడ అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాస రావు ప్రశ్నించారు. ఉమ్మడి మేనిఫెస్టోలో విభజన హామీలు, ప్రత్యేక హోదా, విశాఖ ఉక్కు, పోలవరం నిర్వాసితుల ప్రస్తావనే లేకపోవడం రాష్ట్ర ప్రజలను మోసం చేయడమేనని ఆయన అన్నారు.
ఈ రోజు టీడీపీ - బీజేపీ - జనసేన పార్టీల ఉమ్మడి మేనిఫెస్టోను విడుదల చేసేందుకు సిద్ధమైంది. ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు చంద్రబాబు నివాసంలో మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బీజేపీ ముఖ్య నేతల సమక్షంలో మేనిఫెస్టో విడుదల కానుంది.