Indian IT CEOs: ప్రస్తుతం సమాజంలో ఐటీ జాబ్ అంటే చాలా క్రేజ్ ఉంది. చివరకు తల్లిదండ్రులు వారి కుమార్తెల పెళ్లి చేయాలనుకుంటే ఫస్ట్ ఆఫ్షన్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. నెలకు లక్షల్లో జీతాలు, ఆకర్షించే వార్షిక ప్యాకేజీలు ఐటీ జాబ్‌లకు ప్రధాన ఆకర్షణ. సాధారణ ఉద్యోగి లక్షల్లో జీతాన్ని సంపాదిస్తుంటే, ఇక ఐటీ సంస్థల సీఈఓల జీతం ఎంత ఉంటుందనే ఆసక్తి అందరికి కలుగుతుంది. కంపెనీల అభివృద్ధిలో వీరు కీలకంగా వ్యవహరిస్తుంటారు.
TCS: కోవిడ్ మహమ్మారి సమయంలో అన్ని టెక్ కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్(WFH) అవకాశం ఇచ్చాయి. ప్రస్తుతం కోవిడ్ సమస్య సమిసిపోయి సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రస్తుతం అన్ని టెక్ కంపెనీలు కూడా తమ ఉద్యోగులను ఆఫీసులకు రావాలని, రాకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరిస్తున్నాయి. వర్క్ కల్చర్ మెరుగుపరిచేందుకు, భద్రత దృష్ట్యా ఉద్యోగులను ఆఫీసులకు రావాలని, లేకపోతే కెరీర్ పరిమితులను ఎదుర్కోవాల్సి వస్తుందని చెబుతున్నాయి.
TCS : ఫిబ్రవరి నెల ప్రారంభం కాగానే ఆఫీసుల్లో ఉద్యోగులు, హెచ్‌ఆర్ బృందాల మధ్య జీతాల పెంపు, ప్రమోషన్‌ల గురించి చర్చలు మొదలవుతాయి. కాగా, దేశంలోని ప్రముఖ టెక్ కంపెనీ టాటా కన్సల్టెన్సీ కూడా జీతాల పెంపు, పదోన్నతుల కోసం ఉద్యోగుల ముందు ఒక షరతు పెట్టింది.
Sensex: భారత మార్కెట్లు ఆల్-టైం హైకి చేరుకున్నాయి. శుక్రవారం రోజు సెన్సెక్స్ ఆల్-టైమ్ గరిష్ట స్థాయికి చేరుకుంది. ఐటీ సంస్థల ఫలితాలు అంచనాలకు మించిన తర్వాత బలమైన డిమాండ్‌పై ఆందోళనలు తగ్గించడంతో లాభాలు వచ్చాయి. సెన్సెక్స్ ఆల్-టైమ్ హై 72,600 పాయింట్లను తాకింది. నిఫ్టీ 200 పాయింట్లకు చేరింది. NSE నిఫ్టీ 50 1.22 శాతం జోడించి 21,911 పాయింట్లకు చేరుకోగా, BSE సెన్సెక్స్ 12.36 గంటల సమయానికి 1.31 శాతం పెరిగి 72,661 వద్దకు చేరుకుంది.
IT Sector Jobs : ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు షాకింగ్ న్యూస్. దేశంలోని ప్రముఖ ఐటీ కంపెనీ క్యాంపస్ నియామకాలకు సంబంధించి ముఖ్యమైన సమాచారాన్ని అందించింది.
TCS: దేశీయ టెక్ దిగ్గజం టాటా కన్సెల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) నిర్ణయం వివాదాస్పదం అవుతోంది. ఇటీవల 2000 మంది ఉద్యోగులను టీసీఎస్ ట్రాన్స్‌ఫర్ చేసింది. బదిలీ చేసిన ప్రాంతానికి వెళ్లి విధుల్లో చేరేందుకు ఉద్యోగులకు 2 వారాల సమయం ఇచ్చింది. ఒక వేళ వారికి కేటాయించిన కొత్త స్థానాలకు వెళ్లని ఉద్యోగులపై చర్యలు తీసుకుంటామని వెల్లడించింది.
Infosys: కరోనా మహమ్మారి ముగిసిపోవడంతో దాదాపుగా అన్ని ఐటీ కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానానికి స్వస్తి పలుకుతున్నాయి. తమ ఉద్యోగుల్ని ఆఫీసులకు రావాల్సిందే అని హెచ్చరిస్తున్నాయి. ఇప్పటికే పలు కంపెనీలు తమ ఉద్యోగులకు ఆదేశాలు జారీ చేశాయి. ఆఫీసులకు రాకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని ఉద్యోగులను హెచ్చరిస్తున్నాయి పలు ఐటీ సంస్థలు. ఇదిలా ఉంటే కొన్ని సంస్థలు వారానికి మూడు రోజులైన ఆఫీసులకు రావాలని కోరుతున్నాయి. హైబ్రీడ్ విధానంలో పనిచేయాలని సూచిస్తున్నాయి.
TCS Software employee dies in Car Accident: రన్నింగ్ కారు టైరు పేలి ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మృతి చెందాడు. కారులో ఉన్న మరో ముగ్గురికి స్వల్ప గాయాలు అయ్యాయి. ఈ ఘటన బొంగుళూరు ఔటర్ రింగ్ రోడ్పై జరిగింది. దసరా పండగకు సొంతూరికి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఆదిభట్ల పోలీస్స్టేషన్ ఎస్సై శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం… విజయనగరానికి చెందిన మురళీకృష్ణ వరప్రసాదరావు…
ఉద్యోగం లేఖ ఖాళీగా ఉన్నారా.. సాఫ్ట్ వేర్ కోచింగ్ తీసుకుని జాబ్ కోసం వేచి చూస్తున్నారా.. అయితే మీకు సువర్ణావకాశం. ప్రముఖ ఐటీ కంపెనీ టీసీఎస్ మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. సీనియర్లకు కాకుండా.. ఫ్రెషర్లకు పెద్ద ఎత్తున అవకాశాలు కల్పించబోతుంది. టీసీఎస్ సీవోవో ఎన్. గణపతి సుబ్రమణియన్ తాము క్యాంపస్ నుంచి పెద్ద సంఖ్యలో నియామకాలు చేసుకోనున్నట్టు ప్రకటించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కనీసం 40,000 మంది ఫ్రెషర్లను తీసుకోనున్నట్టు టీసీఎస్ పేర్కొంది.