Sensex: భారత మార్కెట్లు ఆల్-టైం హైకి చేరుకున్నాయి. శుక్రవారం రోజు సెన్సెక్స్ ఆల్-టైమ్ గరిష్ట స్థాయికి చేరుకుంది. ఐటీ సంస్థల ఫలితాలు అంచనాలకు మించిన తర్వాత బలమైన డిమాండ్‌పై ఆందోళనలు తగ్గించడంతో లాభాలు వచ్చాయి. సెన్సెక్స్ ఆల్-టైమ్ హై 72,600 పాయింట్లను తాకింది. నిఫ్టీ 200 పాయింట్లకు చేరింది. NSE నిఫ్టీ 50 1.22 శాతం జోడించి 21,911 పాయింట్లకు చేరుకోగా, BSE సెన్సెక్స్ 12.36 గంటల సమయానికి 1.31 శాతం పెరిగి 72,661 వద్దకు చేరుకుంది.
Read Also: Ishan Kishan: రంజీల్లో ఆడకపోతే.. ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు ఇషాన్ కిషన్ కష్టమే!
మార్కెట్లు తాజా జీవిత కాల గరిష్టానికి చేరుకున్నాయి. నిఫ్టీ 21,000 స్థాయికి చేరుకుంది. మూడవ త్రైమాసికంలో ఐటీ సంస్థలు ఊహించిన దాని కన్నా ఎక్కువ పనితీరును కనబరిచాయి. టీసీఎస్ షేర్లు 4.3 శాతం, ఇన్ఫోసిస్ 7 శాతం పెరిగింది. ఈ పెరుగుదల ఐటీ ఇండెక్స్‌ను దాదాపుగా 5 శాతం పెరిగింది. నిఫ్టీ 50 ఇండెక్స్‌లో ఇన్ఫోసిస్, టిసిఎస్, టెక్ మహీంద్రా, విప్రో మరియు హెచ్‌సిఎల్‌టెక్ 3 శాతం మరియు 7 శాతం మధ్య పెరిగాయి.