TCS: భారతీయ టెక్ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీస్(టీసీఎస్) ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పబోతోంది. త్వరలో ఉద్యోగులకు జీతాల పెంపు ఉన్నట్లు తెలుస్తోంది. ఆఫ్‌సైట్ ఉద్యోగులు 7-8 శాతం వరకు జీతాల పెంపును పొందవచ్చు, అయితే ఆన్‌సైట్ సిబ్బందికి మాత్రం 2-4 శాతం పెంపు ఉండే అవకాశం ఉంది. ఈ ఇంక్రిమెంట్లు ఏప్రిల్ 1 నుంచి అమలులోకి రాబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం జీతాల పెంపు ప్రక్రియ పూర్తయ్యే దశలో ఉందని సంస్థ చెబుతోంది. ఇదిలా ఉంటే మెరుగైన పనితీరు ప్రదర్శించిన వారికి 12-15 శాతం జీతం పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Read Also: Zomato: ‘‘ప్యూర్ వెజ్ మోడ్’’ని ప్రారంభించిన జొమాటో.. వారి కోసం ప్రత్యేకం..
సంస్థ FY24లో 6-9 శాతం శ్రేణిలో జీతాల పెంపును ప్రకటించింది, అధిక పనితీరు ఉన్నవారు 12-15 శాతం పెరుగుదలను అందుకున్నారు. అయితే, ఉద్యోగుల కోతలపై వస్తున్న ఊహాగానాలకు వ్యతిరేకంగా ఇటీవల సంస్థ తన వర్క్ ఫోర్స్ పెంచుకోవాలనే ఉద్దేశాన్ని ప్రకటించింది. టీసీఎస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కే. కె. కృతివాసన్ ఈ విషయాన్ని వెల్లడించారు. 2024లో నియామకాలు చేపట్టాలనే టీసీఎస్ లక్ష్యం గురించి మాట్లాడుతూ.. రిక్రూట్మెంట్ ప్రయత్నాలను తగ్గించే ప్రణాళికలు లేవని చెప్పారు. డిసెంబర్ 31, 2023 నాటికి 6 లక్షలకి పైగా వర్క్ ఫోర్స్‌ని కలిగి ఉంది. డిసెంబరు 31, 2023తో ముగిసిన త్రైమాసికంలో రూ. 11,058 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది.