ఉద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పేందుకు సిద్ధం అవుతుంది కేంద్ర ప్రభుత్వం.. ఈ నెల పార్లమెంబ్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానుండగా… ఫిబ్రవరి 1వ తేదీన పార్లమెంట్‌లో 2022-23 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్.. రెండు విడతలగా బడ్జెట్ సెషన్ జరగబోతోంది.. అయితే, పన్ను రహిత ప్రావిడెంట్ ఫండ్ పరిమితిని పెంచే సూచనలు కనిపిస్తున్నాయి.. దీనిపై బడ్జెట్ 2022-2023లో క్లారిటీ రాబోతోంది.. పీఎఫ్ ఖాతాల్లో ఒక ఆర్థిక సంవత్సరంలో ఇకపై రూ. 5 లక్షల వరకు జమ…
పన్ను చెల్లింపుల విషయంలో కేంద్రం కొత్త నిబంధనలను అమల్లోకి తీసుకొచ్చేందుకు రెడీ అవుతున్నది. జనవరి 1, 2022 నుంచి ఈ నిబంధనలు అమలుకాబోతున్నాయి. ఆర్థిక చట్టం 2021లో భాగంగా సవరణలు చేస్తున్నారు. దీంతో పరోక్ష పన్ను విధానం మరింత కఠినం కాబోతున్నాయి. వార్షిక టర్నోవర్ రూ. 5 కోట్లకు పైన ఉన్న కంపెనీ జీఎస్టీఆర్ 1, జీఎస్టీఆర్ 3బీ దాఖలు చేయాల్సి ఉంటుంది. జీఎస్టీఆర్ 1 అనేది సేల్స్ ఇన్వాయిస్ చూపించే రిటర్న్, జీఎస్టీఆర్ 3బీ అనేది…
దేశంలో చమురు ధరలు రోజు రోజుకు భారీగా పెరుగుతున్నాయి. డీజిల్ పెట్రోల్ ధరలు భారీగా పెరగడంతో వాహనదారులు అవస్థలు పడుతున్నారు. వాహనాలను బయటకు తీసుకొచ్చేందుకు ఇబ్బందులు పడుతున్నారు. ప్రత్యామ్నాయ మార్గాల కోసం అన్వేషిస్తున్నారు. ఇందులో భాగంగానే ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేస్తున్నారు. మామూలు వాహనాలతో పోలిస్తే ఎలక్ట్రిక్ వాహనాల ఖరీదు అధికం. ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేసేవారిక ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. సొంత కార్లను కలిగి ఉండటం లగ్జరీ అంశం కావడంతో ఇప్పటి వరకు వాటికి…
మొన్నటి రోజున రాష్ట్రంలో సంపూర్ణ మధ్యపాన నిషేధం విధిస్తామని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ స్పష్టం చేశారు. బీహార్ ముఖ్యమంత్రి ప్రకటన చేసిన మరుసటి రోజే అసెంబ్లీ ప్రాంగణంలో ఖాళీ మద్యం సీసాలు కనిపించడంతో విపక్షాలు మండిపడిన సంగతి తెలిసిందే. దీనిపై సమగ్ర విచారణ చేయిస్తామని స్వయంగా బీహార్ ముఖ్యమంత్రి ప్రకటించారు. కాగా, ఇప్పుడు దేవాలయాల ఆదాయంపై నాలుగు శాతం పన్నులు చెల్లించాలని బీహార్ బోర్డ్ రిలీజియస్ ట్రస్ట్ ఆదేశాలు జారీ చేసింది. చాలా మంది సొంత…
ఇప్పటికే మన స్టార్ హీరోలకు కావాల్సినన్ని కార్లు గ్యారేజ్ లో వున్నా, మార్కెట్ లో మరో మోడల్స్ మన హీరోలకు నచ్చితే వారి గ్యారేజ్ లో చేరాల్సిందే.. తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ మోజు పడి తీసుకున్న కారు నెట్టింట్లో వైరల్ గా మారింది. ఇక ఆ కారు ఫీచర్లు కూడా అదరగొట్టేశాయి. ‘లాంబోర్గిన ఉరస్ గ్రాఫిటే క్యాప్సుల్’ మోడల్ కారు ఇప్పుడు కేవలం ఎన్టీఆర్ దగ్గర మాత్రమే వుంది. ప్రస్తుతం ఎన్టీఆర్ గ్యారేజ్ లో ఉన్న…
బ్లాక్ ఫంగస్ ఔషధతో పాటు కోవిడ్ 19 కట్టడికోసం చేపట్టే సహాయక చర్యల్లో ఉపశమన చర్యలు చేపట్టింది కేంద్రం.. ఇవాళ కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలాసీతారమన్ అధ్యక్షతన జరిగిన 44వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో వాటిపై చర్చించి కీలక నిర్ణయం తీసుకున్నారు.. ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ.. టీకాలపై 5 శాతం జీఎస్టీకి కట్టుబడి ఉండటానికి కౌన్సిల్ అంగీకరించిందని తెలిపారు..టీకాలు, మందులు మరియు పరికరాలతో సహా వివిధ కోవిడ్ వస్తువులపై పన్ను మినహాయింపు మరియు రాయితీలను…