బ్లాక్ ఫంగస్ ఔషధతో పాటు కోవిడ్ 19 కట్టడికోసం చేపట్టే సహాయక చర్యల్లో ఉపశమన చర్యలు చేపట్టింది కేంద్రం.. ఇవాళ కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలాసీతారమన్ అధ్యక్షతన జరిగిన 44వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో వాటిపై చర్చించి కీలక నిర్ణయం తీసుకున్నారు.. ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ.. టీకాలపై 5 శాతం జీఎస్టీకి కట్టుబడి ఉండటానికి కౌన్సిల్ అంగీకరించిందని తెలిపారు..టీకాలు, మందులు మరియు పరికరాలతో సహా వివిధ కోవిడ్ వస్తువులపై పన్ను మినహాయింపు మరియు రాయితీలను పరిశీలించడానికి మే 28న కౌన్సిల్ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ చేసిన ప్రతిపాదనలను జీఎస్టీ కౌన్సిల్ ఆమోదించింది..
అంబులెన్స్‌లపై జీఎస్టీ ప్రస్తుత 28 శాతం ఉండగా.. దానిని 12 శాతానికి తగ్గించారు.. మెడికల్ గ్రేడ్ ఆక్సిజన్, బిపాప్ యంత్రాలు, ఆక్సిజన్ సాంద్రతలు, వెంటిలేటర్లు, పల్స్ ఆక్సిమీటర్‌పై ఉన్న జీఎస్టీ రేటను 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గించింది.. అయితే, వ్యాక్సిన్లపై 5 శాతం జీఎస్టీ కొనసాగనుంది.. ఇక, కేంద్రం 75 శాతం వ్యాక్సిన్ కొనుగోలు చేస్తుంది.. దానికి జీఎస్టీని కూడా చెల్లిస్తుంది. అయితే, జీఎస్టీ ద్వారా వచ్చే ఆదాయంలో 70 శాతం రాష్ట్రాలతో పంచుకోబడుతుంది అని నిర్మలా సీతారామన్ తెలిపారు. రెమిడిసివిర్ పై జీఎస్టీని 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గించడానికి మోదం తెలిపింది కౌన్సిల్.. టోసిలిజుమాబ్, బ్లాక్ ఫంగస్ డ్రగ్ యాంఫోటెరిసిన్-బిపై పన్ను లేదని.. ఆర్థిక మంత్రి తెలిపారు..