ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. ట్యాక్స్ ఫ్రీ పరిమితి రెట్టింపు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పేందుకు సిద్ధం అవుతుంది కేంద్ర ప్రభుత్వం.. ఈ నెల పార్లమెంబ్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానుండగా… ఫిబ్రవరి 1వ తేదీన పార్లమెంట్‌లో 2022-23 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్.. రెండు విడతలగా బడ్జెట్ సెషన్ జరగబోతోంది.. అయితే, పన్ను రహిత ప్రావిడెంట్ ఫండ్ పరిమితిని పెంచే సూచనలు కనిపిస్తున్నాయి.. దీనిపై బడ్జెట్ 2022-2023లో క్లారిటీ రాబోతోంది.. పీఎఫ్ ఖాతాల్లో ఒక ఆర్థిక సంవత్సరంలో ఇకపై రూ. 5 లక్షల వరకు జమ చేసుకునే ఉద్యోగులందరికీ వడ్డీపై పన్ను ఉండబోదని కేంద్రం ప్రకటించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు ఆర్థిక నిపుణులు. ప్రస్తుతం 2.5 లక్షల రూపాయలుగా పీఎఫ్ ట్యాక్స్ ఫ్రీ పరిమితి ఉండగా.. 2022-23 బడ్జెట్‌లో కేంద్రం దానిని రెట్టింపు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.. కేవలం ప్రభుత్వ ఉద్యోగులకే మాత్రమే కాదు.. ప్రైవేట్ ఉద్యోగులకు కూడా ఇది వర్తింపజేయనున్నారు..
గత బడ్జెట్‌లో ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్‌పై పన్ను భారాన్ని తగ్గిస్తూ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటన చేశారు. ఉద్యోగి తరఫున భవిష్యనిధి ఖాతాకు కంపెనీ తన వాటా జమ చేయనట్టయితే.. అటువంటి కేసులకు రూ.5లక్షల పరిమితి వర్తిస్తుందని మంత్రి వెసులుబాటు కల్పించారు. కానీ, పరిమితిని రూ. 2.5 లక్షల నుంచి రూ. 5 లక్షలకు పెంచే సవరణ ఇప్పటి వరకు ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే ప్రయోజనం చేకూర్చిందని చెప్పాలి.. దీనిపై విమర్శలు కూడా వచ్చాయి.. ఇది వివక్షతో కూడుకున్న నిర్ణయమంటూ ఆరోపణలు వచ్చాయి.. దీంతో.. జీతం ఎత్తే ఉద్యోగులందరికీ ఆ పరిమితిని 5 లక్షల దాకా పెంచేందుకు కేంద్రం సిద్ధమైనట్టు సమాచారం.
Also Read
- Best Post Office Scheme: పథకం చిన్నదే అయినా.. రూ.25 లక్షలను తెచ్చిపెడుతుంది..
- Festive Sale: పండుగ షాపింగ్ తుఫాన్.. 48 గంటల్లో రూ.24,000 కోట్ల సేల్స్!
- Amazon Great Indian Festival: iQOO, Redmi, OnePlus, Samsung కంపెనీ ఏదైనా సరే భారీ డిస్కౌంట్.. రూ.20 వేల లోపు బెస్ట్ స్మార్ట్ఫోన్లు..
- Penny Stock: ఈ స్టాక్ ధర రూ.2 కంటే తక్కువే.. గత 5 రోజుల నుంచి ఇన్వెస్టర్లకు కాసుల వర్షం..
తాజావార్తలు
-
Jai Jasti-Medha Meka: టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ‘ఆమె’ కూతురు.. రొమాంటిక్ పోస్టర్ వచ్చేసింది!
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
-
IAS Officers: ఏపీలో 11 మంది ఐఏఎస్ అధికారులకు పోస్టింగ్‌లు..
-
CJI Suryakant: సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి.. విపక్ష నేతలకు అపాయింట్మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ
-
RTC-Metro Pass: ప్రయాణికులకు అలర్ట్.. ఆర్టీసీ -మెట్రో కామన్ పాస్ ధరలు తగ్గింపు..!
ట్రెండింగ్
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!