కాంపాక్ట్ ఎస్ యూ వీ సెగ్మెంట్ లో ఎక్కువ క్రేజ్ ఉన్న కార్లలో మారుతి సుజుకీ విటారా బ్రేజ్జా ఒకటి. స్టైలిష్ లుక్, స్టన్నింగ్ పెర్ఫామెన్స్, అట్రాక్టెడ్ ఫీచర్లు ఈ కార్ సొంతం. అందుకే ఇండియాలో ఎక్కువగా అమ్ముడవుతున్న కార్లలో ఒకటిగా ఉంది. తాజాగా న్యూ బ్రేజ్జా 2022ను గురువారం లాంచ్ చేసింది మారుతి సుజుకీ కంపెనీ. గతంలో కన్నా మరిన్నిఫీచర్లు, స్పోర్టివ్ లుక్, మరింత ఆకర్షణీయంగా కొత్త బ్రేజ్జా మార్కెట్లోకి వచ్చింది. గతంలో ఉన్న ‘విటారా’…
దేశంలో కార్ల అమ్మకాలు బాగానే పుంజుకుంటున్నాయి. అయితే వీటిలో కాంపాక్ట్ ఎస్ యూ వీలకు డిమాండ్ ఏర్పడింది. హ్యచ్ బ్యాక్ సేల్స్ ను కూడా అధిగమించేలా కాంపాక్ట్ ఎస్ యూ వీల సేల్స్ ఉన్నాయి. హ్యచ్ బ్యాక్ కార్లు వచ్చే ధరలకే కాంపాక్ట్ ఎస్ యూ వీ కార్లు వస్తుండటంతో వినియోగదారులు వీటిని కొనేందుకే మొగ్గు చూపిస్తున్నారు. పలు కార్ల కంపెనీలు కూడా ఎస్ యూ వీ సెగ్మెంట్ లలో కొత్త కార్లను తీసుకువస్తున్నాయి. ఇదిలా ఉంటే…
దేశీయ కార్ల దిగ్గజం టాటా అమ్మకాల్లో దూసుకుపోతున్నది. డీజిల్, పెట్రోల్ కార్లతో పాటుగా ఎలక్ట్రిక్ కార్లను కూడా టాటా కంపెనీ ఉత్పత్తి చేస్తున్నది. ఈవీ కార్లకు డిమాండ్ పెరుగుతున్న దృష్ట్యా టాటా కంపెనీ మొదట నెక్సాన్ పేరుతో ఎలక్ట్రిక్ కార్లను ఉత్పత్తి చేసింది. 30.2 కెడబ్ల్యూహెచ్ బ్యాటరీతో ఈ కార్లు నడుస్తున్నాయి. బ్యాటరీని ఒకసారి రీఛార్జ్ చేస్తు 312 కిమీ వరకు ప్రయాణం చేయవచ్చు. డీసీ ఫాస్ట్ రీఛార్జ్ తో ఛార్జింగ్ చేస్తే గంటలో 80 శాతం…
దేశీయంగా టాటా మోటార్స్ కంపెనీ ఎలక్ట్రిక్ కార్ల విషయంలో దూకుడు పెంచింది. టాటా నెక్సన్ పేరుతో ఎలక్ట్రిక్ కార్లను అందుబాటులోకి తీసుకొచ్చిన టాటా ఇప్పుడు మరో కొత్త వెర్షన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ముందుకు వచ్చింది. టాటా నెక్సన్ బ్యాటరీ సామర్థ్యంపై ఇప్పటి వరకు అనుమానాలు ఉన్నాయి. బ్యాటరీ సామర్థ్యం తక్కువగా ఉండటంతై మైలేజీ తక్కువగా వస్తున్నది. దీంతో రేంజ్ ను పెంచేందుకు బ్యాటరీ సామర్ధ్యాన్ని పెంచి కొత్త వెర్షన్‌ను మార్కెట్‌లోకి తీసుకువచ్చేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నది. అంతర్జాతీయ…