Tata Harrier Electric SUV Debuts At 2023 Auto Expo: భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్ లో రారాజుగా ఉంది దేశీయ ఆటోమేకర్ దిగ్గజం టాటా. వరసగా ఎలక్ట్రిక్ కార్లను రిలీజ్ చేస్తూ ప్రత్యర్థి కంపెనీలను వెనక్కి నెట్టేస్తోంది. దీనికి తోడు టాటా ఈవీలను ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు ప్రజలు. ఇప్పటికే టాటా నెక్సాన్ ఈవీ అమ్మకాల్లో టాప్ గా నిలిచింది. టాటా నుంచి టిగోర్ ఈవీ ఉంది. ఇటీవల టియాగో ఈవీని కూడా లాంచ్ చేసింది. టాటా కాంపాక్ట్ ఎస్ యూ వీ పంచ్ ను కూడా ఎలక్ట్రిక్ వెర్షన్ లో తీసుకు వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది.
Read Also: Father Dance: కొడుకు పెళ్లిలో తండ్రి డ్యాన్స్.. మైకల్ జాక్సన్ను మరిపించేశాడుగా
ఇదిలా ఉంటే ఇటీవల జరిగిన ఆటో ఎక్స్ పో 2023లో తన కొత్త ఎలక్ట్రిక్ కార్లను ప్రదర్శించింది టాటా. రానున్న రోజుల్లో ఈవీ సెగ్మెంట్ లో విపరీతమైన పోటీ ఉంటుందని భావిస్తోంది టాటా. ఈ నేపథ్యంలో కొత్తగా టాటా హారియర్ ఈవీని తెరపైకి తీసుకువచ్చింది. హారియర్ ఈవీతో పాటు కాన్సెప్ట్ ఈవీ కార్లు సియోర్రా ఈవీని టాటా ప్రదర్శించింది. టాటా కర్వ్, ఎవిన్యా పేర్లతో కార్లను తీసుకురాబోతోంది టాటా.
టాటా హారియర్ ప్రత్యేకతలివే..
టాటా హారియర్ 60 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ తో 400-450 కిలోమీటర్ల రేంజ్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు అంచానా వేస్తున్నారు. 0-100 కిలోమీటర్ల వేగాన్ని 10 సెకన్లలో చేరుకోవచ్చు. టాటా నెక్సాన్ లోని కొన్ని ఫీచర్లను హారియర్ లో తీసుకురానున్నారు. జిప్ట్రాన్ టెక్నాలజీ ఆధారితంగా ఈ హారియర్ ఈవీ రాబోతోంది. ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ మల్టీ డ్రైవ్ మోడ్ లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. డ్రైవ్, సిటీ, ఎకో, స్పోర్ట్స్ మోడ్ లు ఉండే అవకాశం ఉంది. ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్, ఆల్ వీల్ డ్రైవ్(ఏడబ్ల్యూడీ) కలిగి ఉండనుంది. బ్యాటరీ, మోటార్ పై 8 ఏళ్లు/1.60 లక్షల కిలోమీటర్లు వరకు వారంటీ ఉండొచ్చు. పనోరమిక్ సన్‌రూఫ్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లే, వెంటిలేటెడ్ డ్రైవర్ మరియు కో-డ్రైవర్ సీట్లు, ప్రీమియం స్పీకర్ సిస్టమ్, ఎయిర్ ప్యూరిఫైయర్ మరియు వైర్‌లెస్ ఛార్జర్ వంటి కొన్ని ముఖ్య ఫీచర్లు ఉన్నాయి.