దేశీయంగా టాటా మోటార్స్ కంపెనీ ఎలక్ట్రిక్ కార్ల విషయంలో దూకుడు పెంచింది. టాటా నెక్సన్ పేరుతో ఎలక్ట్రిక్ కార్లను అందుబాటులోకి తీసుకొచ్చిన టాటా ఇప్పుడు మరో కొత్త వెర్షన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ముందుకు వచ్చింది. టాటా నెక్సన్ బ్యాటరీ సామర్థ్యంపై ఇప్పటి వరకు అనుమానాలు ఉన్నాయి. బ్యాటరీ సామర్థ్యం తక్కువగా ఉండటంతై మైలేజీ తక్కువగా వస్తున్నది. దీంతో రేంజ్ ను పెంచేందుకు బ్యాటరీ సామర్ధ్యాన్ని పెంచి కొత్త వెర్షన్‌ను మార్కెట్‌లోకి తీసుకువచ్చేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నది. అంతర్జాతీయ ఎలక్ట్రిక్ కార్లకు ఏ మాత్రం తీసిపోకుండా ఇండియాలో తక్కువ ధరకు లభించేలా డిజైన్ చేస్తున్నది టాటా.
Read: పాక్‌కు చైనా మిత్ర దేశమే…కానీ, ముక్కుపిండి వసూలు చేసింది…
ప్రస్తుతం 30.2 కిలోవాట్ల బ్యాటరీని 40 కిలోవాట్ల బ్యాటరీగా మార్చేందుకు ప్లాన్ చేస్తున్నది. బ్యాటరీ సామర్థ్యం పెరగడంతో మైలేజ్ 400 కిమీ వరకు ఉంటుందని, రియల్టీలో కనీసం 300 నుంచి 320 కిమీ రేంజ్ వరకు ఉంటుందని అంచనా. కొత్త వెర్షన్‌ను ఈ ఏడాది రిలీజ్ చేయాలని టాటా కంపెనీ కృతనిశ్చయంతో ఉంది. రాబోయే ఆర్థిక సంవత్సరంలో 50 వేల టాటా ఎలక్ట్రిక్ కార్లను ఉత్పత్తి చేయాలని చూస్తున్నది. అదేవిధంగా రెండేళ్ల వ్యవధిలో 1.50 ఎలక్ట్రిక్ కార్లను అమ్మేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది. అంతేకాదు రూ. 10 లక్షల లోపు ధరతో ఎలక్ట్రిక్ కార్ల ఉత్పత్తిపై టాటా దృష్టి సారించింది.