ఎయిర్ ఇండియాను సొంతం చేసుకున్న టాటా గ్రూప్ ఇక, దాని విస్తరణపై దృష్టి సారించింది. టాటా గ్రూప్ యాజమాన్యంలోని ఎయిర్ ఇండియా విమానయాన సంస్థ తన నెట్‌వర్క్‌ను విస్తరిస్తున్నందున కెప్టెన్లు, శిక్షకులతో సహా 1,000 మందికి పైగా పైలట్‌లను నియమించుకుంటుంది.
Tata Water : బాటిల్ వాటర్ మార్కెట్లో సంచలనం సృష్టించే దిశగా టాటా గ్రూప్ సన్నాహాలు చేస్తోంది. బిస్లరీతో ఒప్పందం విఫలమవడంతో, టాటా గ్రూప్ సొంతంగానే మార్కెట్‌లోకి ప్రవేశించబోతోంది.
Air India: ఎయిరిండియా.. దేశీయంగా మరియు అంతర్జాతీయంగా శరవేగంతో విస్తరించనుంది. ఇందులో భాగంగా ఇప్పటికే కొత్త విమానాల కోసం ఆర్డర్ ఇచ్చింది. ఆ విమానాల్లో పనిచేసేందుకు కొత్తవాళ్లను నియమించుకోనుంది. ఈ ఏడాది 4 వేల 200 మందికి పైగా క్యాబిన్ సిబ్బందిని మరియు 9 వందల మంది పైలట్లను అదనంగా తీసుకోనుంది. ఏడాది కిందట టాటా గ్రూప్ సొంతమైన ఎయిరిండియా 470 విమానాలను తెప్పించుకునేందుకు బోయింగ్ మరియు ఎయిర్‌బస్ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్న సంగతి తెలిసిందే.
Today (28-01-23) Business Headlines: పెరిగిన జియో, ఎయిర్’టెల్ కస్టమర్లు: గతేడాది నవంబర్’లో రిలయెన్స్ జియో మరియు ఎయిర్’టెల్’కి పాతిక లక్షల మంది వినియోగదారులు పెరిగారు. వొడాఫోన్ ఐడియాకి మాత్రం 18 లక్షల మందికి పైగా తగ్గారు. ఈ విషయాలను టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా వెల్లడించింది. రిలయెన్స్ జియో 14 లక్షల 26 వేల మందిని, ఎయిర్’టెల్ 10 లక్షల 56 వేల మందిని కొత్తగా చేర్చుకున్నాయి.
Tata Group: విద్యుత్ వాహనాలకు కావాల్సిన బ్యాటరీల తయారీ కోసం టాటా గ్రూపు యూరప్‌లో యూనిట్‌ను ఏర్పాటుచేయనుంది. ఈ మేరకు ప్రణాళికలు రచిస్తున్నట్లు బ్లూమ్‌బర్గ్ సంస్థ తన నివేదికలో పేర్కొంది. టాటా మోటార్స్ తన అనుబంధ కంపెనీ జాగ్వర్ ల్యాండ్ రోవర్‌తో కలిసి ఈ ఫెసిలిటీని అందుబాటులోకి తేనుంది. అక్కడి నుంచే సెల్ బ్యాటరీ ప్యాక్‌లను ప్రపంచవ్యాప్తంగా విక్రయించనుంది.
Air india-Vistara: విస్తార ఎయిర్‌లైన్స్.. టాటా గ్రూప్ ఆధ్వర్యంలోని ఎయిరిండియాలో విలీనం కానుందని సింగపూర్ ఎయిర్‌లైన్స్ రీసెంట్‌గా ప్రకటించింది. విస్తారలో టాటా గ్రూప్‌కి మెజారిటీ షేరు.. అంటే.. 51 శాతం వాటా ఉండగా మిగతా 49 శాతం వాటాను సింగపూర్ ఎయిర్‌లైన్స్ కలిగి ఉంది. ఇదిలాఉండగా.. సింగపూర్ ఎయిర్‌లైన్స్.. ఎయిరిండియాలో 25 పాయింట్ 1 శాతం షేరును దక్కించుకునేందుకు 2 వేల 58 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడి పెట్టనుంది.
ఎయిరిండియా 121.5 మిలియన్ డాలర్లు అంటే ఇండియన్ కరెన్సీలో దాదాపు 990 కోట్ల రూపాయలు రీఫండ్‌గా.. 1.4 మిలియన్ డాలర్లు అంటే రూ.11.35 కోట్లు జరిమానాగా చెల్లించాలని ఆదేశించింది అమెరికా
Gujarat: రెండు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న గుజరాత్ పంట పండుతోంది. ఈ క్రమంలోనే రైతులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వర్షాలతో పంట నష్ట పోయిన రైతులకు రూ.630.34కోట్ల పరిహారం ప్రకటించింది.
Samsung SmartPhones Sales: ఆన్‌లైన్ ఫెస్టివ్ సేల్స్‌లో మొదటి రోజే శామ్‌సంగ్‌కి సంబంధించి కోటి రూపాయలకు పైగా విలువైన స్మార్ట్‌ఫోన్ల సేల్స్ జరిగాయి. అమేజాన్ మరియు ఫ్లిప్‌కార్ట్‌ల ద్వారా ఈ అమ్మకాలు జరిగినట్లు శామ్‌సంగ్ ఇండియా వెల్లడించింది. 12 లక్షలకు పైగా గెలాక్సీ స్మార్ట్‌ఫోన్లను విక్రయించామని తెలిపింది. పండుగ సీజన్ నేపథ్యంలో శామ్‌సంగ్ గెలాక్సీ సిరీస్ స్మార్ట్‌ఫోన్ల రేట్లను 17 శాతం నుంచి 60 శాతం వరకు తగ్గించింది.
Business Headlines: టాటా గ్రూప్ సంస్థలు 60 వేల కోట్ల రూపాయల నిధులను సమీకరించనున్నాయి. ఈ మేరకు ప్రధాన బ్యాంకులతోపాటు ఈక్విటీ ఇన్వెస్టర్లతో చర్చలు జరుపుతున్నాయి.