Gujarat Farmer: రెండు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న గుజరాత్ పంట పండుతోంది. ఈ క్రమంలోనే రైతులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వర్షాలతో పంట నష్ట పోయిన రైతులకు రూ.630.34కోట్ల పరిహారం ప్రకటించింది. శుక్రవారం ఉదయం సీఎం భూపేంద్ర సింగ్ భాఘేల్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. దీని ద్వారా రాష్ట్రంలోని 14జిల్లాలోని 2554గ్రామాల్లోని ఎనిమిది లక్షల మంది రైతులకు ప్రయోజనం చేకూరనుందని అధికారులు తెలిపారు. ఇప్పటికే దీనికి సంబంధించి 14రాష్ట్రాల్లో సర్వే నిర్వహించినట్లు పేర్కొన్నారు. రాష్ట్ర బడ్జట్ రెండు హెక్టార్ల సాగు ఉండి, అరటి పంట నష్టపోయిన వారికి హెక్టారుకు రూ.30వేలు అందించనున్నట్లు తెలిపారు. కనిష్ఠ పరిహారం రూ.4వేలుగా నిర్ణయించారు. ఆన్ లైన్ ద్వారా రైతులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
Read Also: Rishi Sunak meet Modi : మోదీ, రిషి సునాక్ భేటీ ముహూర్తం ఖరారు.. అప్పుడే దానిపై చర్చ
ఇది ఇలా ఉండగా టాటా గ్రూప్, ఎయిర్‌బస్ సంయుక్తంగా వడోదరలో మిలటరీ విమానాల తయారీ ప్లాంట్‌ను ప్రారంభించనున్నాయి. ప్రధాని మోదీ ఆదివారం ఈ ప్లాంట్‌కు శంకుస్థాపన చేయనున్నారు. ఈ ప్రాజెక్టు విలువ సుమారు రూ.22 వేల కోట్లు అని రక్షణ శాఖ కార్యదర్శి డాక్టర్ అజయ్‌కుమార్ వెల్లడించారు. ‘‘ఈ సంస్థలతో రక్షణ శాఖ 56 విమానాల కొనుగోలు ఒప్పందం కుదుర్చుకుంది. దీని ప్రకారం ఎయిర్‌బస్ సంస్థ వచ్చే ఏడాది నుంచి 2025 వరకు 16 సీ-295 మిలటరీ రవాణా విమానాలను సరఫరా చేస్తుంది. మిగతా 40 విమానాలను మేకిన్ ఇండియాలో భాగంగా టాటా సంస్థ భాగస్వామ్యంతో భారత్‌లోనే తయారు చేస్తుంది. కాగా.. వేదాంత లిమిటెడ్-తైవాన్‌కు చెందిన ఫాక్స్‌కాన్ భాగస్వామ్యంతో రూ. 1.60 లక్షల కోట్ల పెట్టుబడులతో సెమీకండక్టర్ల తయారీ పరిశ్రమ కూడా అహ్మదాబాద్‌లో ఏర్పాటు కానున్న విషయం తెలిసిందే. వాస్తవానికి లక్షకు పైగా కొలువులను సృష్టించే ఈ ప్రాజెక్టు మహారాష్ట్రకు వెళ్లాల్సింది. ఎన్నికల నేపథ్యంలోనే గుజరాత్‌కు మారిందని తెలుస్తోంది.