ఎయిరిండియాకు బిగ్ షాక్ ఇచ్చింది అగ్రరాజ్యం అమెరికా.. టాటా-గ్రూప్ యాజమాన్యంలోని ఎయిరిండియాకు భారీ జరిమానా విధించింది.. కోవిడ్ 19 సమయంలో విమానాలను రద్దు చేయడం లేదా మార్చిన కారణంగా ప్రయాణీకులకు రీఫండ్ చేయడంలో జరిగిన జాప్యంపై ఆగ్రహం వ్యక్తం చేసిన అమెరికా.. 121.5 మిలియన్ డాలర్లు అంటే ఇండియన్ కరెన్సీలో దాదాపు 990 కోట్ల రూపాయలు రీఫండ్‌గా.. 1.4 మిలియన్ డాలర్లు అంటే రూ.11.35 కోట్లు జరిమానాగా చెల్లించాలని ఆదేశించింది.. ఇక, 600 మిలియన్ డాలర్లకు పైగా రీఫండ్ చేయడానికి అంగీకరించిన ఆరు విమానయాన సంస్థల్లో ఎయిరిండియా కూడా ఒకటని యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ట్రాన్స్ పోర్టేషన్ పేర్కొంది.. ఎయిరిండియా ‘రిఫండ్ ఆన్ రిక్వె స్ట్’ విధానం, తమ పాలసీకి విరుద్ధంగా ఉందని స్పష్టం చేసింది..
Read Also: Jagga Reddy: కేసీఆర్, హరీష్‌రావుకి కృతజ్ఞతలు తెలిపిన జగ్గారెడ్డి..
అయితే, తమ రవాణాశాఖ నిబంధనల ప్రకారం విమానాన్ని రద్దు చేసినా లేదా మార్పు చేసినా చట్టబద్ధంగా టిక్కెట్లను వాపసు చేయాలని, ఈ మేరకు ఎయిరిండియాకు ఆదేశించినట్లు రవాణా కార్యదర్శి పీట్ బుట్టిగీగ్ పేర్కొన్నారు.. అయితే, ఎయిరిండియాను టాటా గ్రూప్ స్వాధీనం చేసుకోవడానికి ముందు జరిగిన పరిణామం ఇది.. అధికారిక పరిశోధన ప్రకారం, క్యారియర్ రద్దు చేసిన లేదా టైం మార్చినా విమానాల కోసం రవాణా శాఖకు దాఖలు చేసిన 1,900 వాపసు ఫిర్యాదులలో సగానికి పైగా ప్రాసెస్ చేయడానికి ఎయిరిండియాకు 100 రోజుల కంటే ఎక్కువ సమయం పట్టిందట.. ఫిర్యాదులను దాఖలు చేసిన మరియు క్యారియర్‌తో నేరుగా రీఫండ్‌లను అభ్యర్థించిన ప్రయాణీకులకు రీఫండ్ ప్రాసెస్ చేయడానికి పట్టే సమయానికి సంబంధించిన సమాచారాన్ని ఎయిరిండియా ఏజెన్సీకి అందించలేకపోయింది. ఎయిరిండియా పేర్కొన్న రీఫండ్ విధానంతో సంబంధం లేకుండా, ఆచరణలో ఎయిరిండియా సకాలంలో రీఫండ్‌లను అందించలేదు. ఫలితంగా, వినియోగదారులు తమ రీఫండ్‌లను స్వీకరించడంలో తీవ్ర జాప్యం కారణంగా గణనీయమైన నష్టాన్ని చవిచూశారని యూఎస్ రవాణా శాఖ పేర్కొంది.
ఎయిరిండియాతో పాటు ఫ్రాంటియర్, టీఏపీ పోర్చుగల్, ఏరో మెక్సికో, ఈఐఏఐ మరియు ఏవియాంకా వంటి ఇతర విమానయాన సంస్థలకు కూడా జరిమానాలు విధించబడ్డాయి. ఎయిరిండియా తన ప్రయాణీకులకు 121.5 మిలియన్ డాలర్లు రీఫండ్ చేయాలి మరియ 1.4 మిలియన్ డాలర్లు జరిమానాగా చెల్లించలని ఆదేశించింది.. ఫ్రాంటియర్ 222 మిలియన్ డాలర్లు, 2.2 మిలియన్ డాలర్ల జరిమానా, టీఏపీ పోర్చుగల్ 126.5 మిలియన్ డాలర్లు రీఫండ్‌గా మరియు 1.1 మిలియన్ డాలర్లు పెనాల్టీగా చెల్లించాలి.. అవియాంకా 76.8 మిలియన్ డార్లలు రీఫండ్ మరియు 750,000 డాలర్ల పెనాల్టీ, ఈఐఏఐ 61.9 మిలియన్ డాలర్ల రీఫండ్ మరియు 900,000 డాలర్లు పెనాల్టీగా చెల్లించాలని ఆదేశాలు జారీచేసింది అమెరికా..