Fake Apple Products: ఐ ఫోన్...! ఇది మొబైల్ ఫోన్ కాదు... ఓ స్టేటస్ సింబల్ !! లక్ష రూపాయల విలువైన వేరే మోడల్ ఫోన్ వాడుతున్నా... 50 వేల ఐ ఫోన్ ఉంటేనే గొప్ప !! కనీసం చేతికి యాపిల్ వాచ్ ఐనా ఉండాలి.. అని ఫీల్ అయ్యే వారినే టార్గెట్ చేసిందో ముఠా.
Sand Mafia: హైదరాబాద్‌లో ఇసుక అక్రమ రవాణా, ఇసుక నిల్వలు, విక్రయం జోరుగా సాగుతున్నట్లు వెలుగులోకి వచ్చింది. వివిధ జిల్లాల్లోని ఇసుక రీచ్‌ల నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసి, నగరంలో అధిక ధరలకు విక్రయిస్తున్న మాఫియా అరాచకాలు మితిమీరుతున్నాయి. ఈ అక్రమ దందాపై టాస్క్ ఫోర్స్ విభాగం దృష్టి సారించి పెద్ద ఎత్తున సోదాలు నిర్వహిస్తోంది. జిల్లాలలోని ఇసుక రీచ్‌ల నుంచి లారీల ద్వారా ఇసుకను సరఫరా చేయించుకునే మాఫియా 10,000 రూపాయలకు ఒక లారీ…
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచలో అనుమతుల్లేకుండా వడ్డీ వ్యాపారాలు నిర్వహిస్తున్న వారిపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడిచేశారు. పాల్వంచ పట్టణంలోని గట్టాయిగూడెం, బొల్లోరిగూడెం, నట్రాజ్ సెటర్లలోని పలువురు వ్యాపారుల నివాసాలపై సీసీఎస్ టాస్క్ఫోర్స్ ఎస్సై పుల్లయ్య సిబ్బందితో కలిసి ఏకకాలంలో దాడులు చేశారు. అనంతరం సీసీఎస్ టాస్క్ఫోర్స్ ఎస్సై పుల్లయ్య మీడియాకు వివరాలు వెల్లడించారు. గుడివాడ చంద్రశేఖర్ వద్ద లెక్కించే యంత్రం, రూ.1,26,560, మంచికంటి సత్యనారాయణ వద్ద నూ.4 లక్షలు, ప్రామిసరీ నోట్లను , పాల్వంచ పట్టణ…