India US Trade: డొనాల్డ్ ట్రంప్ ‘‘సుంకాల’’ దెబ్బకు ప్రపంచ దేశాలు భయపడుతున్నాయి. ఇప్పటికే ట్రంప్ మెక్సికో, కెనడా, చైనా ఉత్పత్తులపై సుంకాలను పెంచారు. ఏప్రిల్ నుంచి ‘‘పరస్పర సుంకాలు’’ అమలు చేస్తామని హెచ్చరించాడు. ఈ నేపథ్యంలో సుంకాల తగ్గింపు, వాణిజ్యంపై భారత్, అమెరికా అధికారులు కసరత్తు చేస్తున్నారు. అమెరికా ఉత్పత్తులైన హర్లే-డేవిడ్సన్ బైక్స్, బోర్సన్ విస్కీ, కాలిఫోర్నియా వైన్‌లపై దిగుమతి సుంకాలను తగ్గించాలని భారత ప్రభుత్వం పరిశీలిస్తు్న్నట్లు తెలుస్తోంది.
Donald Trump: యూఎస్ పౌరులకు ఆదాయపు పన్ను నుంచి విముక్తి కల్పించడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రణాళికలు రచిస్తున్నారు. ప్రజలు స్వేచ్ఛగా ఖర్చు చేసి ఆర్థిక వ్యవస్థలోకి నిధుల ప్రవాహాన్ని పెంచడానికే ఈ దిశగా తాము అడుగులు వేస్తున్నామని పేర్కొన్నారు.
ట్రంప్ తన నిర్ణయంపై ఎప్పుడు ముందుకెళ్లినా దానికి తగినట్లు స్పందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో పేర్కొన్నారు. ఆయన నిర్ణయం అమలు చేస్తే యూఎస్ వినియోగదారులే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది అన్నారు.
America: అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత బ్రిక్స్ దేశాలపై డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా డాలర్‌కు నష్టం కలిగించేలా డీ-డాలరైజేషన్ ప్రయత్నాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ గెలిచినప్పటి నుంచి పొరుగు దేశం చైనాకు నిత్యం ఇబ్బందికర వార్తలు వస్తూనే ఉన్నాయి. చైనాపై ఎక్కువ టారిఫ్‌లు విధిస్తామని ట్రంప్ గతంలో ప్రకటించారు. దీని వల్ల అమెరికాలో చైనా వస్తువుల రేటు పెరుగుతుంది. దీంతో విక్రయాలు తగ్గి చైనా కంపెనీలకు నష్టం వాటిల్లుతుంది. ఈ అవకాశాన్ని భారత్ అందిపుచ్చుకోవాలని ప్లాన్ చేస్తోంది.
Donald Trump: అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌కు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. అమెరికా ఉత్పత్తులపై ఇండియా అధిక సుంకాలు విధిస్తుందని ఆరోపించాడు.
Justin Trudeau: హాలీఫాక్స్ ఛాంబరాఫ్ కామర్స్ నిర్వహించిన కార్యక్రమంలో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మాట్లాడుతూ.. తమపై ట్రంప్ అదనపు టారీఫ్ లు విధిస్తే.. తాము ప్రతి చర్యలకు దిగుతామని వార్నింగ్ ఇచ్చారు.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ఇటీవల ఘన విజయం సాధించారు. మరోసారి అధ్యక్ష పీఠాన్ని ట్రంప్ అధిరోహించనున్నారు. నాలుగేళ్ల పాటు అగ్ర రాజ్యం రిపబ్లికన్ పార్టీ వశం కాబోతుంది. తాజా ఫలితాల్లో ట్రంప్ మ్యాజిక్ ఫిగర్ దాటుకుని భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు.