India US Trade: యూఎస్ ప్రొడక్ట్స్ హార్లే బైక్స్, బోర్బన్ విస్కీలపై సుంకం తగ్గించనున్న భారత్.!
- భారత్ అమెరికా మధ్య వాణిజ్య చర్చలు..
- హార్లీ డేవిడ్సన్ బైక్స్, బోర్బన్ విస్కీపై సుంకాల కోత..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India US Trade: డొనాల్డ్ ట్రంప్ ‘‘సుంకాల’’ దెబ్బకు ప్రపంచ దేశాలు భయపడుతున్నాయి. ఇప్పటికే ట్రంప్ మెక్సికో, కెనడా, చైనా ఉత్పత్తులపై సుంకాలను పెంచారు. ఏప్రిల్ నుంచి ‘‘పరస్పర సుంకాలు’’ అమలు చేస్తామని హెచ్చరించాడు. ఈ నేపథ్యంలో సుంకాల తగ్గింపు, వాణిజ్యంపై భారత్, అమెరికా అధికారులు కసరత్తు చేస్తున్నారు. అమెరికా ఉత్పత్తులైన హర్లే-డేవిడ్సన్ బైక్స్, బోర్సన్ విస్కీ, కాలిఫోర్నియా వైన్‌లపై దిగుమతి సుంకాలను తగ్గించాలని భారత ప్రభుత్వం పరిశీలిస్తు్న్నట్లు తెలుస్తోంది.
ప్రభుత్వం గతంలో హర్లే డేవిడ్సన్ బైకులపై దిగుమతి సుంకాన్ని 50 శాతం నుంచి 40 శాతానికి తగ్గించింది. సుంకాలు మరింతగా తగ్గించడానికి చర్చలు జరుగుతున్నాయి. ఈ ప్రీమియం బైకులు భారత్‌లో సరసమైన ధరలకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అదే విధంగా బోర్బన్ విస్కీ దిగుమతి సుంకాన్ని గతంలో 150 శాతం నుంచి 100 శాతానికి తగ్గించారు. కాలిఫోర్నియా వైన్‌పై కూడా సుంకాలు తగ్గించేందుకు చర్చలు జరుగుతున్నాయి.
Also Read
- ACP Vivek Bhagat: ‘‘కులం పేరుతో దూషించారు, నా పరువు తీశారు’’.. సీజేపీ నేతలపై ఏసీపీ వివేక్ భగత్ ఫిర్యాదు..
- Salary Hike 2026-27: ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. భారీగా పెరగనున్న జీతాలు!.. ఏ రంగంలో ఎక్కువంటే?
- Dhruv Rathee: యూట్యూబర్ ధ్రువ్ రాఠీని వెంబడిస్తున్న కేసులు.. కోర్టు సమన్లు జారీ..
- Meerut Blue Drum Murder: మీరట్ ‘‘బ్లూ డ్రమ్ మర్డర్’’.. మరణశిక్ష విధిస్తూ ‘‘భగవద్గీత’’ను ప్రస్తావించిన న్యాయమూర్తి.!
Read Also: Congress: అమిత్ షాపై కాంగ్రెస్ ‘‘సభా హక్కుల ఉల్లంఘన నోటీసు’’..
140 కోట్ల జనాభా ఉన్న భారత మార్కెట్ యాక్సెస్ కోసం ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి ఒత్తిడి తీసుకువస్తున్నాడు. భారత్ తమ ఉత్పత్తులపై భారీ సుంకాలను విధిస్తుందని పలుమార్లు బహిరంగంగానే అన్నారు. ఈ నేపథ్యంలోనే ఇరు దేశాలు కసరత్తు చేస్తున్నాయి. వాణిజ్య చర్చల్లో భాగంగా మోటార్ సైకిళ్లు, ఆల్కాహాల్ పానియాలకే పరిమితం కాకుండా, భారతదేశ ఔషధ ఉత్పత్తులు, రసాయనాల అమెరికా ఎగుమతి విస్తరణ గురించి కూడా అధికారులు చర్చిస్తున్నారు. భారతదేశంలో అభివృద్ధి చెందుతున్న ఫార్మాసూటికల్ రంగంలో అమెరికా తన మార్కెట్‌ని పెంచుకోవడానికి ఆసక్తి చూపిస్తోంది. అదే విధంగా భారత్ యూఎస్‌కి ఎగుమతుల అనుకూలమైన నిబంధనలను పొందాలని చూస్తోంది.
బోర్బన్ విస్కీ ,కాలిఫోర్నియా వైన్‌పై సుంకాలు తగ్గించడం వల్ల ఈ ఉత్పత్తులు భారత మద్యం మార్కెట్లో మరింత పోటీతత్వాన్ని పెరుగుతుంది. అదే సమయంలో, అమెరికా నుండి పెరిగిన ఔషధ దిగుమతులు ప్రపంచ జనరిక్ మెడిసిన్ మార్కెట్‌లో కీలక పాత్ర పోషించే భారతీయ ఔషధ తయారీదారులపై ప్రభావం చూపుతాయి.
తాజావార్తలు
-
CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
-
AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
-
OTR: పవన్ పట్టు.. బాబు వ్యూహం.. ఎవరికి ఎన్ని సీట్లు?
-
Dada: బాలయ్య ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్… హైదరాబాద్‌లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
-
Acer Sospiro A70 5G: Acer కొత్త 5G ఫోన్ లాంచ్.. డ్యుయల్ డిస్ప్లేలు, 20GB RAM, 64MP కెమెరా!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..