జపాన్, దక్షిణ కొరియాతో సహా 14 దేశాలపై డొనాల్డ్ ట్రంప్ కొత్త సుంకాలను ప్రకటించారు. దీని ప్రభావం అమెరికా స్టాక్ మార్కెట్ పతనం రూపంలో కనిపించింది. మరోవైపు, ట్రంప్‌తో కొనసాగుతున్న వివాదం, కొత్త రాజకీయ పార్టీ ప్రకటనతో ఎలాన్ మస్క్‌కు ఎదురుదెబ్బ తగిలింది. గత 24 గంటల్లో, మస్క్ కంపెనీ టెస్లా స్టాక్ క్రాష్ అయ్యింది. దీని కారణంగా 15.3 బిలియన్ డాలర్లు (రూ. 1.31 లక్షల కోట్లకు పైగా) నష్టాన్ని చవిచూడాల్సి వచ్చింది. గత కొన్ని…
India on Trump: ఆపరేషన్ సిందూర్‌తో భారత్- పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల ఏర్పాడ్డాయి. భారత దాడితో పాకిస్తాన్ కాళ్ల బేరానికి వచ్చి కాల్పుల విరమణ ప్రతిపాదన చేసింది. దీంతో ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ చర్చలు ప్రారంభమయ్యాయి. అయితే, రెండు దేశాల మధ్య తానే మధ్యవర్తిత్వం వహించానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీని తర్వాత, ఆయన మరో వింత వాదన చేశారు.
ప్రముఖ టెక్నాలజీ దిగ్గజం ఆపిల్ సంస్థ కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. అమెరికా, చైనా మధ్య తీవ్రతరమవుతున్న వాణిజ్య ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా మార్కెట్ కోసం ఉద్దేశించిన ఐఫోన్ల తయారీని పూర్తిగా భారత్ కు తరలించాలని యోచిస్తోంది.భారత్‌లో ఐఫోన్ల తయారీ కేంద్రంగా మార్చేందుకు వేగంగా అడుగులు వేస్తోంది. అమెరికా మార్కెట్ కోసం అవసరమయ్యే ఐఫోన్లను భారత్‌లో తయారు చేయాలని ప్రణాళికలు సిద్ధ చేస్తోంది. తాజాగా ఈ అంశాలపై యాపిల్ సీఈఓ టిమ్ కుక్ స్పందించారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనాపై 145 శాతం సుంకం విధించిన విషయం తెలిసిందే. తాజాగా చైనా కూడా యూఎస్‌కు తగిన సమాధానం ఇచ్చింది. అమెరికా ఉత్పత్తులపై సుంకాన్ని 84 శాతం నుంచి 125 శాతానికి పెంచుతున్నట్లు చైనా ప్రకటించింది. ఈ అదనపు టారిఫ్ ఏప్రిల్ 12 నుంచి వర్తిస్తుంది. ఏప్రిల్ 12 నుంచి చైనాలో అమెరికన్ ఉత్పత్తులపై సుంకం 84 శాతం నుంచి 125 శాతానికి పెరుగుతుందని చైనా ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ…
Bengaluru: కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో నీటి ధరలు పెరగనున్నాయి. తాగు నీటి పన్నును లీటరుకు 7-8 పైసలు పెంచినట్లు బెంగళూరు నీటి సరఫరా బోర్డు పేర్కొనింది.
ట్రంప్ వాణిజ్య యుద్ధం ప్రకటించడంతో ప్రపంచ మార్కెట్లు కుదేల్ అయిపోతున్నాయి. వ్యవస్థలన్నీ తీవ్రంగా అతలాకుతలం అయిపోతున్నాయి. తాజాగా చైనా మీదైతే ఏకంగా 104 శాతం సుంకాలను ట్రంప్ ప్రకటించారు. దీంతో వాణిజ్య యుద్ధం మరింత తీవ్రతరం అయింది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన సుంకాలు కారణంగా ప్రపంచ మార్కెట్ కుదేలైపోయింది. అమెరికా మార్కెట్‌తో పాటు అన్ని మార్కెట్లు కకావికలం అయ్యాయి. ఇక ఆసియా మార్కెట్ అయితే అల్లకల్లోలం అయింది. ఇదే అంశంపై ఆదివారం ట్రంప్‌ను విలేకర్లు ప్రశ్నంచగా చాలా తేలిగ్గా తీసుకున్నారు.
USA: డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ దేశాలపై ‘‘పరస్పర సుంకాలు’’ విధించాడు. ట్రంప్ దెబ్బతో అమెరికన్లు సూపర్ మార్కెట్లకు పరుగు తీస్తున్నారు. విదేశీ వస్తువులపై సుంకాలు ప్రకటించిన కొన్ని రోజు తర్వాత, ధరలు తక్కువగా ఉన్నప్పుడే పలు వస్తువుల్ని కొనుగోలు చేయాలని అమెరికన్లు భావిస్తున్నారు. దీంతో స్టోర్లు, సూపర్ మార్కెట్ల ముందు రద్దీ పెరిగింది.
వైట్‌హౌస్ మీడియా కార్యదర్శి కరోలిన్ లీవిట్ మాట్లాడుతూ.. అమెరికా ఉత్పత్తులపై భారత్ 100 శాతం సుంకాలు విధిస్తుందన్నారు. ఇతర దేశాలు విధించే అధిక సుంకాలతో యూఎస్ ఉత్పత్తులను ఎగుమతి చేయడం అసాధ్యంగా మారిందన్నారు. అందుకే వాటిపై ప్రతీకార సుంకాలు విధించడానికి ఇదే సరైన సమయమని వెల్లడించింది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏప్రిల్ 2 నుంచి పరస్పర సుంకాలను ప్రకటించిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో తాజాగా యూఎస్ ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది. చైనా, కెనడా, మెక్సికోలతో భారత్ ను పోల్చమని యూఎస్ తెలిపింది. భారత్- అమెరికాల మధ్య వాణిజ్యపరమైన ఒప్పందానికి సంబంధించిన చర్చలు బుధవారం ప్రారంభమయ్యాయి. యూఎస్‌కు చెందిన వాణిజ్య శాఖ అధికారులు, ఢిల్లీలోని అధికారులతో చర్చల సమయంలో ఈ విషయంపై స్పష్టత వచ్చినట్లు తెలుస్తోంది.