విజయవాడలో ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులుపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ స్మారకోపన్యాసం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి ఆదిమూలపు సురేష్, ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, వెలంపల్లి శ్రీనివాస్ హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ.. భారతదేశ స్వాతంత్ర్య సమరంలో తెలుగువారి పాత్ర గణనీయమైనదని పేర్కొన్నారు.