తెలంగాణలో ఇప్పుడు మునుగోడు ఉప ఎన్నిక కాకరేపుతోంది.. కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన తాజా మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి.. బీజేపీలో చేరి మరరోసారి బరిలోకి దిగనుండగా.. అభ్యర్థుల ఎంపిక వేటలో పడిపోయాయి.. అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలు.. అయితే, మునుగోడులో కమ్యూనిస్టు పార్టీలో టీఆర్ఎస్ పార్టీకే తమ మద్దతు అని తేల్చేశాయి.. ఈ విషయంలో సీపీఐ ముందుండగా.. ఆ తర్వాత కాస్త సమయం తీసుకుని సీపీఎం కూడా గులాబీ పార్టీకే తమ మద్దతు అని తేల్చేసింది..…
మునుగోడు బరిలో టీఆర్‌ఎస్ దూకుడు సిద్దమైంది. మొన్న సీపీఐ టీఆర్‌ఎస్ కు మద్దతు పలుకగా.. నేడు సీపీఎం మద్దతు ప్రకటించడంపై చర్చనీయాంశంగా మారింది. బీజేపీని ఓడించేందుకే టీఆర్ ఎస్‌కు మద్దతు తెలుపు తున్నట్లు అటు సీపీఐ ఇటు సీపీఎం పార్టీలు ప్రకటించడంతో.. సర్వత్రా ఉత్కంఠంగా మారింది. తాజాగా బీజేపీలో వెంకట్‌రెడ్డి రాజగోపాల్ రెడ్డి కషాయి కండువా కప్పుకున్న విషయం తెలిసిందే. ఆగస్టు 21 అమిత్ షా సమక్షంలో ఆయన బీజేపీ లో చేరారు. కాంగ్రెస్ లో ఇన్ని…
మునుగోడులో బీజేపీ అభ్యర్థిని ఓడించేందుకు ఏ పార్టీకైనా మద్దతు ఇస్తామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రకటించారు. సీపీఐ పార్టీతో చర్చించి అభ్యర్థిని నిలబెట్టే విషయాన్ని ప్రకటిస్తామన్నారు.
తెలంగాణలో రాజకీయ వేడి ఎక్కువగా ఉందని, ముందస్తు ఎన్నికలు జరుగుతాయనే ప్రచారం జరుగుతోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ప్రజా సమస్యల గురించి ఏ పార్టీ మాట్లాడకుండా రాజకీయాలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
బీజేపీ నేత డీకే అరుణ సంచలన కామెంట్స్ చేశారు. టీఆర్ఎస్ పార్టీ ముందస్తు ఎన్నికలకు సిద్ధం అవుతోందని ఆమె అన్నారు. ప్రజలకు ఇచ్చిన హమీలను కేసీఆర్ తుంగలో తొక్కి మరోసారి ఎన్నికల్లో ప్రజలను మోసగించేందికు సిద్దమవుతున్నాడని విమర్శించారు. రాష్ట్రంలో బలపడుతున్న బీజేపీని అడ్డుకునేందుకు కేసీఆర్ కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా,సంక్షేమ పథకాలను ప్రజలకు కార్యకర్తలు విధిగా తెలియజేయాలని సూచించారు. ఆయుష్మాన్ భారత్ పథకాన్ని తెలంగాణలో అమలు చేయకపోవడంతో పేదలు వైద్యం కోసం ఇబ్బంది పడుతున్నారని…
వరుసగా పెరుగుతున్న నిత్యావసరాలు, పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ సిలిండర్ల బాదుడుతో సామాన్యులు నానా అవస్థలు పడుతున్నారు. తెలంగాణలో ఆర్టీసీ, విద్యుత్ చార్జీలు విపరీతంగా పెంచారు. చంద్రబాబు హయాంలో ఛార్జీల పెంపుపై పెద్ద ఎత్తున ఆందోళన జరిగింది. చంద్రబాబు అధికారం కోల్పోయారు. ఇపుడు ధరలు తగ్గించక పోతే, ఆందోళనలు చేస్తాం అన్నారు సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం. వరి కొనుగోలు విషయంలో కేంద్ర, రాష్ట్రాలు బాధ్యత తీసుకోవాలన్నారు. కేసీఆర్ బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా మాట్లాడడాన్ని స్వాగతిస్తున్నాం. రాష్ట్ర ప్రయోజనాల…
సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా తమ్మినేని వీర భద్రం మరోసారి ఎక గ్రీవంగా ఎన్నిక అయ్యారు. ఈ పదవిని చేపట్టడం తమ్మినేని వీరభద్రానికి ఇది మూడో సారి. కాగా.. 60 మంది కార్యవర్గ సభ్యుల ఎన్నికను కూడా పూర్తి చేశారు. రంగారెడ్డి జిల్లా తుర్కాయంజాల్ ఆదివారం నుంచి సీపీఎం తెలంగాణ రాష్ట్ర పార్టీ 3 వ మహాసభలు జరుగుతున్నాయి.ఈ నేపథ్యంలోనే సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా తమ్మినేని వీర భద్రం మరోసారి ఏక గ్రీవంగా ఎన్నిక అయ్యారు.…
సీపీఎం జాతీయ సమావేశాల్లో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీజేపీ, టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలను విమర్శించారు. రాజకీయ విధానం పార్టీకీ ముఖ్యమని, కానీ రాజకీయ విధానం ఎప్పుడు ఒకేలా ఉండదన్నారు. పరిస్థితికి అనుగుణంగా మారుతుందన్నారు. సీఎం కేసీఆర్ ఆచరణ సాధ్యం కానీ మార్గాలను ఎంచుకున్నారని, కాళేశ్వరం ఒక్కటే తెలంగాణ ప్రజల సమస్యలను తీర్చదన్నారు. ఆంధ్రా వాళ్ళ వల్లనే మనకు ఉద్యోగాలు రావడం లేదని కేసీఆర్ చెప్పారన్నారు. దళితులకు మూడెకరాలు…
రేపటి నుండి సీపీఎం రాష్ట్ర మహాసభలు జరగనున్న నేపథ్యంలో తెలంగాణ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన బీజేపీ, టీఆర్‌ఎస్‌ను తీవ్రంగా విమర్శించారు. దేశానికి బీజేపీ.. తెలంగాణకు టీఆర్‌ఎస్ ప్రమాదకరమన్నారు.బీజేపీ…టీఆర్‌ఎస్ రెండు పార్టీలు మాకు సమానమేనన్నారు. ఈ మధ్య కేసీఆర్ బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడటం స్వాగతించదగిన అంశం అని ఆయన పేర్కొన్నారు. Read Also: సీఎం కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ బీజేపీకి వ్యతిరేకంగా పనిచేసే పార్టీలతో…
బీజేపీ విచ్ఛిన్నకర విధానం అమలు చేస్తోందని, తెలంగాణకి బీజేపీతో ప్రమాదం పొంచి ఉందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ ఓటమి లక్ష్యంగా పని చేస్తామని అన్నారు. బీజేపీ పట్ల టీఆర్‌ఎస్ మెతక వైఖరి అవలంబిస్తోందని, ఈ మధ్య బీజేపీ ఒడిపోవాలని కేసీఆర్ స్టేట్ మెంట్ ఇస్తున్నారు.. సంతోషమేనని ఆయన అన్నారు. కానీ కేసీఆర్ ప్రకటనలే వస్తున్నాయి.. కానీ ఆయన స్టేట్ మెంట్ ఎక్కడ లేదని ఆయన పేర్కొన్నారు.…